విజయవాడ: కూటమి ప్రభుత్వం మరోసారి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఇప్పటికే రెండు పర్యాయాలు దశలవారీగా పలు స్థానాలను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్ లతో పాటు అప్కాబ్ చైర్మన్ పోస్టులను భర్తీ చేసింది. ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు (TDP) నియమితులయ్యారు. ఆయనకు ఏలూరు జిల్లా డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్) ఛైర్మన్‌గానూ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు AP ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రకాశం జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా కామేపల్లి సీతారామయ్య (TDP), ఏలూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా గన్ని వీరాంజనేయులు, కాకినాడ జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా తుమ్మల రామస్వామి (Janasena) నియమితులయ్యారు. ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్‌గా కసిరెడ్డి శ్యామల (TDP), ఏలూరు జిల్లా డీసీఎంఎస్ (డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ) ఛైర్మన్‌గా చాగంటి మురళీకృష్ణ (Janasena), కాకినాడ జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్‌గా పి. చంద్రమౌళి (TDP)ను ఏపీ ప్రభుత్వం నియమించింది.
పలు దఫాలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్న కూటమి ప్రభుత్వం ఆదివారం నాడు 22 మందిని వివిధ సంస్థలకు ఛైర్మన్లుగా నియమించింది. ఈ మేరకు ఛైర్మన్ల నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. 1) ఏపీ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా ఆలపాటి సురేశ్ కుమార్ నియామకం2) ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ బోర్డు చైర్మన్‌గా డా. జెడ్ శివ ప్రసాద్3) ఏపీ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (APEWIDC) చైర్మన్ ఎస్.రాజశేఖర్4) ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ డా. రాయపాటి శైలజ5) ఏపీ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్.6) ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ7) ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ (APSSDC) చైర్మన్ బురుగుపల్లి శేషారావు.8) ఏపీ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత9) తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ దివాకర్ రెడ్డి10) ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ వాణి వెంకట శివ ప్రసాద్ పెన్నుబోయిన.11) ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ (APNRTS) చైర్మన్ డా.రవి వేమూరు12) ఏపీ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మలేపాటి సుబ్బా నాయుడు.13) ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ (SC Commission) చైర్మన్ కె.ఎస్. జవహర్.14) ఏపీ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ పెదిరాజు కొల్లు15) ఏపీ కుమ్మరి శాలివాహన సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్.16) ఏపీ వడ్డెర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు.17) ఏపీ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ ఆకాశపు స్వామి.18) ఏపీ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ (APSIDC) చైర్మన్ లీలకృష్ణ.19) ఏపీ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ రియాజ్.20) ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డా.పసుపులేటి హరి ప్రసాద్.21) ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్ సోల్ల బోజ్జి రెడ్డి.22) ఏపీ గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ