కొత్త సంవత్సరం రోజున భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. బ్లాక్‌హోల్ పరిశోధ కోసం ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం నుంచి కొనసాగుతోంది.
ఎక్స్‌పోశాట్ శాటిలైట్‌ను ఉదయం 9.10నిమిషాలకు శ్రీహరి కోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ 58తో ఎక్స్‌పోశాట్‌ను నింగిలోకి పంపించనున్నారు. దీంతో మరో పది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది.
ఆదివారం ఉదయం 8 గంటల పది నిమిషాలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు. అంతకు ముందు ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రయోగ రాకెట్ నమూనకు ప్రత్యేక పూజలు చేశారు.
ఇది భారత్ తొలి పొలారిమెట్రీ మిషన్... ప్రపంచంలో రెండోది. అమెరికా తర్వాత ఈప్రయోగం చేస్తున్న రెండో దేశంగా కొత్త చరిత్రకు నాంది పలకబోతోంది. పల్సర్‌లు, బ్లాక్‌హోల్ ఎక్స్‌రే బైనరీలు, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్ స్టార్స్‌పై ఎక్స్‌పోశాట్ స్టడీ చేయనుంది.
ఈ ఉపగ్రహాన్ని భూకక్ష్యలో 500-700 కిలోమీటర్ల దూరంలో ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో రెండు పేలోడ్స్ ఉన్నాయి. అవి ఐదేళ్ల పాటు సర్వీస్ అందిస్తాయి. ఒకటి పాలి ఎక్స్, రెండోది ఎక్స్-రే స్పెక్ట్రోసోపీ టైమింగ్. మొదటిదికి ఎక్స్ కిరణాలను పొలారిమీటర్. దీన్ని రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసింది. రెండో పరికరాన్ని స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ రూపొందించింది.