Nellore Rottela Pandaga Barashahid Darga: నెల్లూరు బారా షహీద్ దర్గా (Barashahid Darga) రొట్టెల పండగకు (Nellore Rottela Pandaga) అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నెల్లూరు జిల్లాలోని దర్గాలకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుండే సంగతి తెలిసిందే. జిల్లాలో ఉన్న మూడు ముఖ్యమైన దర్గాల్లో ఒకటి నెల్లూరు (Nellore Darga) పట్టణంలోని బారా షహీద్ దర్గా (Barashahid Darga). చారిత్రక నేపథ్యం ఉన్న ఈ దర్గాకు అంతే విశేషమైన ఆరోగ్య చరిత్ర కూడా ఉంది. ఈ మట్టి పవిత్రం, ఈ నీరు పవిత్రం అని చెబుతారు. 12 మంది యుద్ధ వీరుల మరణానికి చిహ్నంగా ఇక్కడ దర్గా ఏర్పాటు చేశారు. ఇప్పటికా 12 సమాధులు ఇక్కడ ఉంటాయి. ఈ సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ దర్గాకు ఉన్న ప్రాముఖ్యం గురించి బాహాషహీద్ దర్గా (Barashahid Darga) ముజావర్ హఫీజుద్దీన్ ఖాద్రి వివరించారు.


దర్గా గంధ మహోత్సవం రోజున, దర్గా (Nellore Darga) సమీపంలోని స్వర్ణాల చెరువులో రొట్టెలు (Nellore Rottela Pandaga) మార్చుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తులు బాగా నమ్ముతారు. ఆరోగ్య రొట్టె, ఐశ్వర్య రొట్టె, విదేశీ విద్యా రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె.. ఇలా వివిధ రకాల పేర్లతో వీటిని పిలుస్తారు. ఒక ఏడాది రొట్టె తీసుకుని తమ కోర్కె నెరవేరితే, మరుసటి ఏడాది అదే పేరుతో రొట్టెను చేసుకుని తీసుకొచ్చి అక్కడ ఆయా ప్రతిఫలం కోసం ఎదురు చూస్తున్నవారికి ఇస్తుంటారు. ఆరోగ్య రొట్టెకు ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక్కడి రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారని బాహాషహీద్ దర్గా (Nellore Darga) ముజావర్ హఫీజుద్దీన్ ఖాద్రి తెలిపారు.


కరోనా వల్ల రెండేళ్లుగా రొట్టెల పండగ నిర్వహించ లేదు. కేవలం ముజావర్ల సమక్షంలోనే రొట్టెల పండగ (Nellore Rottela Pandaga) జరిగింది. భక్తులను నెల్లూరు (Nellore) కి అనుమతించ లేదు. ఈ ఏడాది గతంకంటే రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తారని అంటున్నారు. అన్ని ఏర్పాట్లు చేశామని దర్గా కమిటీ (Barashahid Darga) నిర్వహకులు సయ్యద్ సమీ వెల్లడించారు.


రాష్ట్రానికే తలమానికంగా రొట్టెల పండగ


నెల్లూరు జిల్లాకే కాదు, రాష్ట్రానికే తలమానికంగా ప్రతి ఏడాదీ నెల్లూరు నగరంలో రొట్టెల పండగ నిర్వహిస్తారు. నెల్లూరులోని స్వర్ణాల చెరువులో రొట్టెలను మార్చుకుంటారు ప్రజలు. తమకు అనుకూలమైన పని జరిగినప్పుడు ఆయా రొట్టెల పేర్లు చెప్పి అవి అవసరమైన వారికి ఇస్తారు. వచ్చే ఏడాది తమకు ఆయా పనులు జరిగినప్పుడు వారు కూడా అలాగే రొట్టెలను తెచ్చి ఇవ్వడం ఆనవాయితీ. చదువు, ఆరోగ్య సంబంధ సమస్యలు, వివాహం, ఉద్యోగం, విదేశీ యానం.. ఇలా రకరకాల రొట్టెలను ఇక్కడ మార్చుకుంటారు.  ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి 13 వరకు నెల్లూరులో రొట్టెల పండగ జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


రెండేళ్ల తర్వాత 


మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగను నిర్వహిస్తారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల రొట్టెల పండగను నిర్వహించలేదు. కేవలం గంధ మహోత్సవాన్ని మాత్రమే నిర్వహించారు. భక్తులను రొట్టెలు మార్చుకోడానికి దర్గా వద్దకు అనుమతించలేదు. రెండేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది పండగను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ జిల్లాకే తలమానికంగా ఈ ఏడాది పండగ నిర్వహిద్దామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బారా షహీద్ దర్గా రొట్టెల పండగ సమీక్షా సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై సమీక్ష నిర్వహించారు. 


సీఎం జగన్ కు ఆహ్వానం


కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా రొట్టెల పండుగ నిర్వహించలేదని, ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో భక్తులు, యాత్రికులు దర్గాను సందర్శించే అవకాశముందని తెలిపారు మంత్రి కాకాణి. గతంలో పండగను నిర్వహించిన అనుభవం ఉన్న అధికారులు ప్రస్తుతం బదిలీల్లో ఉన్నప్పటికీ, తాత్కాలికంగా వారి సేవలను వినియోగించుకునేలా సంబంధిత జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతామని మంత్రి తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున మౌలిక వసతులైన మంచినీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. బారా షహీద్ దర్గా దర్శనం అనంతరం భక్తులు, యాత్రికులు జిల్లాలోని ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు. అలాంటి అన్ని ప్రాంతాలను గుర్తించి సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చుకున్న బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తామని మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.