Nellore Earth Quake: నెల్లూరు, కడప జిల్లాల్లో స్వల్ప భూకంపం - భయంతో జనం పరుగులు

Nellore: మర్రిపాడు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, కండ్రిక, పడమట నాయుడుపల్లి, చిలకపాడు, కృష్ణాపురం తదితర గ్రామాల్లో భూకంపం వచ్చినట్టు చెబుతున్నారు గ్రామస్తులు.

Continues below advertisement

Minor Earthquake in Nellore Kadapa: నెల్లూరు, కడప జిల్లాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఈ ఉదయం 5.20గంటలకు భూకంపం వచ్చింది. 3 సెకన్లపాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఇళ్లలోని వస్తువులు కదిలి కిందపడిపోయాయి. దీంతో ప్రజలు భూకంపంగా అనుమానించారు. దాదాపుగా అందరికీ ఇదే అనుభవం ఎదురుకావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మర్రిపాడు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, కండ్రిక, పడమట నాయుడుపల్లి, చిలకపాడు, కృష్ణాపురం తదితర గ్రామాల్లో భూకంపం వచ్చినట్టు చెబుతున్నారు గ్రామస్తులు. గతంలో కూడా ఓసారి ఇలాగే మర్రిపాడు మండలంలో భూకంపం వచ్చింది. ఇప్పుడు మరోసారి భూమి కంపించడంతో ప్రజలు భయపడుతున్నారు.

Continues below advertisement

కడప జిల్లా బద్వేలు మండలంలోనూ భూమి కంపించిందని విద్యానగర్‌, చిన్నకేశంపల్లి గ్రామస్థులు తెలిపారు. ఇళ్లలోని సామాన్లు కింద పడడం, మంచాలు ఊగడం వంటివి అనుభూతి చెందడంతో వెంటనే ఇంట్లోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. 

Continues below advertisement