TDP Mahanadu: నెల్లూరులో జరగాల్సిన టీడీపీ మహానాడు  ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు చర్యల్లో భాగంగా  క్యాన్సిల్ అయిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే మహానాడును  హైబ్రిడ్ పద్ధతుల్లో  మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో తక్కువ మంది సభ్యులతో జరుపబోతున్నారు. మరీ విపరీతమైన ఆర్భాటాలు లేకుండా ఈసారి మహానాడు జరగబోతోంది. అంతా ఓకే కానీ నెల్లూరులో జరగాల్సిన మహానాడు క్యాన్సిల్ కావడం మాత్రం  అక్కడ టిడిపిలో నెలకొన్న వర్గ పోరును  పరిష్కరించే ఛాన్స్ లేకుండా చేసింది అనే వాదన వినబడుతోంది.

Continues below advertisement

నెల్లూరు టీడీపీలో ఎవరి వర్గం వారిదే..!

చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూటమి రాష్ట్రవ్యాప్తంగా బలంగానే ఉంది. కొన్నిచోట్ల టిడిపి జనసేన  నేతల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ చెయ్యి దాటిపోయి పరిస్థితి అయితే లేదు. కానీ నెల్లూరులో పరిస్థితి వేరు. అక్కడ టీడీపీ నేతల్లోనే సామరస్యం చాలా తక్కువ. కారణం చాలా శక్తివంతమైన లీడర్లందరూ ఆ జిల్లాలోనే ఉండడం. మంత్రి నారాయణ, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, అనం ఫ్యామిలీ, వేమూరి కుటుంబం, సోమిరెడ్డి ఇలా బలమైన లీడర్లు అందరూ అక్కడే ఉండడం  కూటమి అబ్స్ ల్యూట్ మెజారిటీలో ఉండడంతో  అక్కడ పైచేయి కోసం ఎవరికి వారు  తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

Continues below advertisement

జిల్లాపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న నేతలు 

  • పి. నారాయణ- మంత్రి
  • ఆనం రామనారాయణ రెడ్డి ఫ్యామిలి
  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 
  • వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం 
  • సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  

నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా వారి వారి అనుచరుల ముద్రతో కుర్ర కారు చేస్తున్న హల్చల్  సోషల్ మీడియా పోస్టుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎప్పటికీ సీఎం చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టి ఒకటికి  రెండుసార్లు వార్నింగ్ ఇచ్చారు. గతంలో నెల్లూరులో పదికి పది సీట్లు సాధించిన వైసిపి 2024 ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో తమకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం టిడిపి అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా స్థానిక అగ్రనేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టడం కోసం, నేతల మధ్య సామరస్యం తేవడం కోసం మహానాడును శ్రీకాకుళం నుంచి నెల్లూరుకి షిఫ్ట్ చేశారు అనే ప్రచారం ఉంది.

మహానాడు ఏర్పాట్లలో కచ్చితంగా అక్కడ స్థానిక నేతలు అందరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వారందరినీ ఒకే తాటిపైకి  తేవడానికి ఇదో మంచి అవకాశం అని టిడిపి అధిష్టానం భావించింది. కానీ ఇప్పుడు సడన్‌గా  మహానాడుని మంగళగిరికి షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి రావడంతో  టోటల్ సీన్ మారిపోయింది. 

లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక జరుగుతోన్న తొలిమహానాడు 

టిడిపిలో నాయకత్వ మార్పు నెమ్మదిగా జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఒక్కో విభాగం నారా లోకేష్ టీమ్ చేతిలోకి వచ్చేస్తోంది.  ఇప్పుడాయన ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు. అందుకే ఈసారి జరిగే మహానాడు సూపర్ సక్సెస్ కావాలని టిడిపి ప్లాన్ చేసింది. గతంలో జరిగిన కడప మహానాడులో ఏకంగా 5 లక్షల మందితో  బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈసారి ఆ రికార్డు బద్దలు కొట్టాలని భావించింది టిడిపి .

అందుకే మహానాడును నెల్లూరుని వేదికగా ఎంచుకుంది. కీలక నేతలు అందరూ అక్కడే ఉండడంతో సభ సక్సెస్ చేయడం ఈజీ అలానే వారి మధ్య ఉన్న విభేదాలను తొలగించడమూ ఈజీ అని టిడిపి అధిష్టానం అనుకుంది. కానీ మోదీ పొదుపు పిలుపు కారణంగా మహానాడు నెల్లూరు నుంచి మంగళగిరికి షిఫ్ట్ కావడంతో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. మరి నెల్లూరులో సీనియర్ నేతల మధ్య నెలకొన్న వర్గ పోరును టిడిపి ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.