Lokesh On Anil Kumar : నెల్లూరు పట్టణంలో యువగళం పాదయాత్రలో ... మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ అవినీతిపై నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై అనిల్ కుమార్ లోకేష్‌పై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. తాజాగా లోకేష్.. అనిల్ కుమార్ అక్రమాస్తుల వివరాలను వెల్లడించారు. ఎక్కడెక్కడ ఎంతెంత మేర భూములు ఆస్తులు కొనుగోలు చేశారో వివరించారు. అధికార దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున భూముల్ని కొన్నారని లోకేష్ ఆరోపించారు. మొత్తంగా రూ. వెయ్యి కోట్లకుపైగా అక్రమాస్తుల్ని అనిల్ సంపాదించారన్నారు.
లోకేష్ ప్రకటించిన అనిల్ అక్రమాస్తుల వివరాలు
1. దొంతాలి వద్ద బినామీలు చిరంజీవి, అజంతా పేరు మీద 50 ఎకరాలు. విలువ రూ.10 కోట్లు.
2. నాయుడుపేట లో 58 ఎకరాలు బినామీ పేర్లతో. విలువ రూ.100 కోట్లు.
3. ఇనుమడుగు సెంటర్ లో బినామీలు రాకేష్, డాక్టర్ అశ్విన్ పేరుతో 400 అంకణాలు. విలువ రూ.10 కోట్లు.
4. ఇస్కాన్ సిటీ లో బినామీల పేర్లతో 87 ఎకరాలు. విలువ రూ. 33 కోట్లు.
5. అల్లీపురం లో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 42 ఎకరాలు. విలువ రూ.105 కోట్లు. ఇందులో 7 ఎకరాలు ఇరిగేషన్ భూమి.
6 సాదరపాళెం లో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 12 ఎకరాలు. విలువ రూ.48 కోట్లు.
7 ఒక పెద్ద కాంట్రాక్టర్ నుండి దశల వారీగా అనిల్ బినామీ చిరంజీవి కి కోట్ల రూపాయలు వచ్చాయి.
8 బృందావనం లో శెట్టి సురేష్ అనే బినామీ పేరుతో 4 ఎకరాలు. విలువ 25 కోట్లు.
9. దామరమడుగు లో బావమరిది పేరుతో 5 ఎకరాలు. విలువ 4 కోట్లు.
10. గూడూరు- చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు లేపేసాడు. 40 ఎకరాల్లో లే అవుట్ వేశారని లోకేష్ వివరాలు వెల్లడించారు.
రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నానన్న అనిల్ కుమార్
రాజకీయాల్లోకి వచ్చి తాను ఆస్తులు పోగొట్టుకున్నానని. అనిల్ కుమార్ ఇంతకు ముందు లోకేష్ సవాల్‌కు చాలెంజ్ చేశారు. రాజకీయాల్లోకి రాకముందు మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి కంటే ఒక్క పైసా ఎక్కువ ఉన్నా, భగవంతుడు శిక్షిస్తాడని.. ఎక్కడకి రమ్మన్నా నేను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అనిల్ కుమార్ ప్రకటించారు. ఇస్కాన్ సిటీలో పద్దెనిమిదిన్నర ఎకరాలు ఉండేదని.. కానీ ఇప్పుడు ఎకరా మాత్రమే ఉందన్నారు. తన తమ్ముడు అశ్విన్ మొదటి నుంచి ఒక హాస్పిటల్లో షేర్ హోల్డర్‌గా ఉన్నాడని.. ఆయన కు ఆస్తులు ఉంటే తనకు ఏం సంబంధం అని.. అనిల్ కుమార్ ప్రశ్నించారు.
అనిల్ మొదట టిక్కెట్ తెచ్చుకోవాలన్న లోకేష్
మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ టాచ్‌లో అభివృద్ధిపై చర్చకు నేను రెడీ..ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని లోకేష్ సవాల్ చేశారు. జగన్ కూడా ఊరూరా హామీలిచ్చారు..అవికూడా విడుదల చేస్తామని చెప్పారు. అనిల్ కు నెల్లూరు సిటీ టికెట్ ఉందా..లేదా.? జగన్ చెప్పారా.? అని లోకేష్ ప్ర్సనించారు. నెల్లూరు ప్రజలు అనిల్ ను ఓడిస్తారన్నారు. అనిల్ మొదట టికెట్ తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు.