Case filed on Kakani Govardhan Reddy | కావలి: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కావలి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు రావడంతో కాకాణిపై కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల కిందట బోగోలు మండలం కోళ్లదిన్నేలో మాజీ మంత్రి కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రసన్న ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.