టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ తీరుపట్ల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. సీఎం జగన్ చేసిన పాపాలు రాయలసీమకు పాపాలుగా మారాయని అన్నారు. ఆయన నేరాలు ఏపీ ప్రయోజనాలకి ఉరి వేస్తున్నాయని అన్నారు. జగన్ చేసిన తప్పుల వల్ల ఒక్కో ప్రాజెక్టు చేయిదాటిపోతోందని అన్నారు. అక్ర‌మాస్తుల కేసుల మాఫీ కోసం ప్ర‌త్యేక‌హోదా వ‌దులుకున్నాడని.. రుషికొండ గుండు కొట్టిన కేసు త‌ప్పించుకునేందుకు విశాఖ రైల్వేజోన్ కి నీళ్లొదిలాడని అన్నారు. బాబాయ్ ని చంపించిన కేసులో కేసులో త‌మ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం ఏకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడి పోల‌వ‌రం ప్రాజెక్టుని ప్ర‌శ్నార్థ‌కం చేశాడని నారా లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.






‘‘జ‌గ‌న్ చేసిన పాపాలు రాయ‌ల‌సీమ‌కి శాపాలుగా మారుతున్నాయి. జ‌గ‌న్ చేసిన నేరాలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల‌కి ఉరివేస్తున్నాయి. అక్ర‌మాస్తుల కేసుల మాఫీ కోసం ప్ర‌త్యేక‌హోదా వ‌దులుకున్నాడు. రుషికొండ గుండు కొట్టిన కేసు త‌ప్పించుకునేందుకు విశాఖ రైల్వేజోన్ కి నీళ్లొదిలాడు. బాబాయ్ ని చంపించేసిన కేసులో త‌మ్ముడిని ర‌క్షించుకునేందుకు ఏకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడి పోల‌వ‌రం ప్రాజెక్టుని ప్ర‌శ్నార్థ‌కం చేశాడు. రాయ‌ల‌సీమ బిడ్డ‌నంటూ క్యాన్స‌ర్ గ‌డ్డలా పీడిస్తున్నాడు. జ‌గ‌న్ స‌ర్కారు దారుణ వైఫ‌ల్యం వ‌ల్లే కృష్ణాజ‌లాల కేటాయింపులు పునఃస‌మీక్ష జ‌రుగుతోంది. ప్ర‌జ‌లారా జ‌గ‌న్ కి ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో ఏమేమి కోల్పోయారో గుర్తించండి. రాయ‌ల‌సీమ సాగు, తాగునీటి అవ‌స‌రాలు తీర్చే కృష్ణా జ‌లాలలో న్యాయ‌బ‌ద్ధ‌మైన వాటా కోల్పోతే, రాయ‌ల‌సీమ ఎడారిగా మారే ప్ర‌మాదం ఉంది’’ అని లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


‘‘వైకామ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలంతా కూసే రోత బూతు కూతలపై ఎన్ని వేల కేసులు నమోదు చేయాలి పోలీసులు?  బూతు కూతలు వద్దని హితవు పలికిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని మాత్రం టెర్రరిస్టులా అరెస్టు చేశారు. వైకామ పార్టీకి ఓ చట్టం, విపక్షాలకి మరో చట్టమా? ఇదేం అరాచక పాలన?’’ అని రెండు రోజుల క్రితం మరో ట్వీట్ చేశారు.


‘‘సైకో జగన్ ఫ్యాక్షన్ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు. రాజ్యాంగాన్ని కాలరాశారు. సత్యాన్ని వధించారు, ధర్మాన్ని చెరపట్టారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు గారిని అక్రమ అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపిస్తోన్న అరాచకాలని నిరసిస్తూ మహాత్మా గాంధీ జయంతి రోజైన నేడు‌..  నిరాహార దీక్ష చేసి చంద్రబాబు గారికి  సంఘీభావం తెలుపుతున్నాను. సత్యమేవ జయతే’’


విజిల్స్ వేయడంపై కేసులు - లోకేశ్
‘‘విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మంది పై కేసా? పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తారా? వీళ్ళ తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు గారి అరెస్ట్ వార్తలు చూసారని, పసుపు రంగు దుస్తులు కట్టుకున్నారని, సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారు. ఒక పని చేయండి రాజద్రోహం కేసు పెట్టి...ఉరిశిక్ష వేసేయండి. జగన్ కి పిచ్చి పీక్స్ లో ఉన్నట్లు ఉంది. కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినోడికి సరే...అమలు చేసినోడి బుర్రా బుద్ధీ ఏమయ్యింది?’’ అని మరో పోస్టు పెట్టారు.