Chandrababu Naidu Oath Ceremony LIVE: 'చంద్రబాబు అనే నేను' - ఏపీ సీఎంగా నాలుగోసారి చంద్రబాబు ప్రమాణస్వీకారం

Chandrababu Oath Taking Ceremony LIVE Updates: ఏపీ సీఎంగా చంద్రబాబు, మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి

Sheershika Last Updated: 12 Jun 2024 12:26 PM
మంత్రిగా ఎమ్.రామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా ఎమ్.రామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.

మంత్రిగా కే.శ్రీనివాస్ ప్రమాణస్వీకారం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా కే.శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. 2024లో గజపతినగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మంత్రిగా వాసంశెట్టి సుభాష్ ప్రమాణం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా వాసంశెట్టి సుభాష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు.

మంత్రిగా సవితమ్మ ప్రమాణం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా సవితమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. 2024 ఎన్నికల్లో పెనుగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మంత్రిగా టీజీ భరత్ ప్రమాణ స్వీకారం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు.

మంత్రిగా బీసీ జనార్ధన్ రెడ్డి ప్రమాణం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా బీసీ జనార్థన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు.

మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి ప్రమాణం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. 2024 ఎన్నికల్లో సాలూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు.

మంత్రిగా కందుల దుర్గేష్ ప్రమాణం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈయన నిడదవోలు నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ ప్రమాణం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు.

మంత్రిగా బాల వీరాంజనేయ స్వామి ప్రమాణస్వీకారం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా  బాల వీరాంజనేయ స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు.

మంత్రులుగా అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి ప్రమాణస్వీకారం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రులుగా అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి ప్రమాణస్వీకారం చేశారు. వారితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు.

మంత్రిగా పయ్యావుల కేశవ్ ప్రమాణం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా పయ్యావుల కేశవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు.

మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈయన 2023లో టీడీపీలో చేరారు. 2024లో ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మంత్రిగా ఫరూఖ్ ప్రమాణ స్వీకారం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా మహ్మద్ ఫరూఖ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. 1994, 99, 2004లో వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2024లో ఐదోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

మంత్రిగా నిమ్మల రామానాయుడు ప్రమాణం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా నిమ్మల రామానాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈయన ఎమ్మల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు.

మంత్రిగా సత్యకుమార్ ప్రమాణం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు.

మంత్రులుగా కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నారాయణ, వంగలపూడి అనిత ప్రమాణం

Chandrababu Naidu Oath Ceremony Live: ఆంద్రప్రదేశ్ మంత్రులుగా కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నారాయణ, వంగలపూడి అనిత ప్రమాణం చేశారు. వారితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.

మంత్రిగా అచ్చెన్నాయుడు ప్రమాణస్వీకారం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా అచ్చెన్నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు.

మంత్రిగా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం

Chandrababu Naidu Oath Ceremony Live: మంత్రిగా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు.

'పవన్ అనే నేను' - మంత్రిగా జనసేనాని ప్రమాణస్వీకారం

Chandrababu Naidu Oath Ceremony Live: జనసేనాని పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు.

చంద్రబాబు అనే నేను - ఆంద్రప్రదేశ్ సీఎంగా నాలుగోసారి చంద్రబాబు ప్రమాణస్వీకారం

Chandrababu Naidu Oath Ceremony Live: నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, ఇతర రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

సభా వేదికపైకి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఎంపీ పురంధేశ్వరి

Chandrababu Naidu Oath Ceremony Live: చంద్రబాబు ప్రమాణస్వీకార వేదికపై ఆయన సతీమణి భువనేశ్వరి, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా వారిని బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించారు. కాగా, సభా వేదికపై మొత్తం 36 మంది ఆశీనులు కానున్నారు.

చంద్రబాబు ప్రమాణస్వీకారం - వేదిక వద్దకు మెగా ఫ్యామిలీ

Chandrababu Naidu Oath Ceremony Live: చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు సహా మెగా ఫ్యామిలీ కూడా హాజరయ్యారు. నాగబాబు, ఇతర కుటుంబ సభ్యులు, పవన్ కుమారుడు అకీరా, నటుడు సాయిధరమ్ తేజ్ హాజరయ్యారు.

కేసరపల్లి సభా వేదిక వద్దకు రామ్ చరణ్

Chandrababu Naidu Oath Ceremony Live: చంద్రబాబు ప్రమాణస్వీకార వేదిక వద్దకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేరుకున్నారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం - ఒకే కారులో ప్రధాని మోదీ, చంద్రబాబు

Chandrababu Naidu Oath Ceremony Live: గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రధాని చేరుకోగా ఆయనకు చంద్రబాబు ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోదీ, చంద్రబాబు ఒకే కారులో కేసరపల్లి సభా వేదిక వద్దకు చేరుకున్నారు.

చంద్రబాబు ప్రమాణస్వీకారం - సభా వేదిక వద్దకు విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

Chandrababu Naidu Oath Ceremony Live: చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే హాజరయ్యారు.

గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ

Chandrababu Naidu Oath Ceremony Live: ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం - వేదిక వద్దకు అమిత్ షా

Chandrababu Naidu Oath Ceremony Live: చంద్రబాబు ప్రమాణస్వీకారం వేదిక వద్దకు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేరుకున్నారు.

గన్నవరం ఎయిర్ పోర్టుకు చంద్రబాబు

Chandrababu Naidu Oath Ceremony Live: చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఆయన ఘన స్వాగతం పలకనున్నారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం - వేదిక వద్దకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు

Chandrababu Naidu Oath Ceremony Live: చంద్రబాబు ప్రమాణస్వీకారం వేదిక వద్దకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు చేరుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు సైతం వేదిక వద్దకు చేరుకున్నారు.

చంద్రబాబు ప్రమాణస్వీకారం - వేదిక వద్దకు బయలుదేరిన మెగా ఫ్యామిలీ

Chandrababu Naidu Oath Ceremony Live: కాసేపట్లో చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు. ఇప్పటికే నారా లోకేశ్, బాలకృష్ణ దంపతులు, కొలుసు పార్థసారథి, సినీ నటులు చైతన్య కృష్ణ, సుహాసిని, నిర్మాత ఆదిశేషగిరిరావు, నటులు నారా రోహిత్, శివాజీ, తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వేదిక వద్దకు చేరుకున్నారు.

నవ్యాంద్రలో రెండోసారి సీఎంగా చంద్రబాబు

Chandrababu Naidu Oath Ceremony Live: చంద్రబాబు నవ్యాంధ్రలో రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2014లో నవ్యాంధ్రకు తొలి సీఎంగా జూన్ 8న ప్రమాణస్వీకారం చేశారు. 2019లో వైఎస్ జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు 2024లో చంద్రబాబు మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అత్యధిక కాలం ఏపీకి సీఎంగా చేసిన నేతగా ఆయన చరిత్ర సృష్టించారు.

ఎక్కువ కాలం సీఎంగా చంద్రబాబు రికార్డు - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంలుగా ఎవరెంత కాలం చేశారంటే?

Chandrababu Naidu Oath Ceremony Live: ఉమ్మడి ఏపీలో సీఎంలుగా చేసింది వీరే..


1. నీలం సంజీవరెడ్డి (1956) - 3 సంవత్సరాలు 71 రోజులు


2. దామోదర సంజీవయ్య (1960) - 2 సంవత్సరాలు 60 రోజులు


3. నీలం సంజీవరెడ్డి (1962) - 1 సంవత్సరం 337 రోజులు


4. కాసు బ్రహ్మానందరెడ్డి (1964) - 3 సంవత్సరాల 244 రోజులు


5. పీవీ నరసింహారావు (1971) - 1 సంవత్సరం 72 రోజులు


6. జలగం వెంగళరావు (1973) - 4 సంవత్సరాల 86 రోజులు


7. మర్రి చెన్నారెడ్డి (1978) - 2 సంవత్సరాలు 219 రోజులు


8. టంగుటూరి అంజయ్య (1980) - 1 సంవత్సరం 136 రోజులు


9. భవనం వెంకట్రామరెడ్డి (1982) - 208 రోజులు


10. కోట్ల విజయభాస్కరరెడ్డి (1982) - 111 రోజులు


11. నందమూరి తారకరామారావు (1983) - 1 సంవత్సరం 220 రోజులు


12. నాదెండ్ల భాస్కరరావు (1984) - 31 రోజులు


13. నందమూరి తారకరామారావు (1984) - 174 రోజులు


14. నందమూరి తారకరామారావు (1985) - 4 సంవత్సరాలు 269 రోజులు


15. మర్రి చెన్నారెడ్డి (1989) - 1 సంవత్సరం 14 రోజులు


16. నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి (1990) - 1 సంవత్సరం 297 రోజులు


17. కోట్ల విజయభాస్కర్ రెడ్డి (1992) - 2 సంవత్సరాల 64 రోజులు


18. నందమూరి తారకరామారావు (1994) - 263 రోజులు


19. నారా చంద్రబాబు (1995) - 8 సంవత్సరాల 256 రోజులు


20. వైఎస్. రాజశేఖర్ రెడ్డి (2004) - 5 సంవత్సరాల 111 రోజులు


21. కొణిజేటి రోశయ్య (2009) - సంవత్సరం 83 రోజులు


22. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (2010) - 3 సంవత్సరాల 96 రోజులు

చంద్రబాబు ప్రమాణస్వీకారం - రద్దీగా విజయవాడ - గన్నవరం రహదారి

Chandrababu Naidu Oath Ceremony Live: చంద్రబాబు ప్రమాణస్వీకార క్రమంలో విజయవాడ - గన్నవరం రహదారి రద్దీగా మారింది. ఇప్పటికే సభా ప్రాంగణం కూటమి శ్రేణులు, అభిమానులతో భారీగా నిండిపోయింది. ఈ క్రమంలో కనకదుర్గ వారధిపై వందలాదిగా వాహనాలు నిలిచిపోయాయి. కాజా టోల్ ప్లాజా వద్ద 2 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అటు, ప్రమాణస్వీకారం వేదిక వద్దకు పలువురు రాజకీయ నేతలు, అతిథులు భారీగా తరలివస్తున్నారు.



చంద్రబాబు కేబినెట్ - జిల్లాల వారీగా లెక్కలివే

Chandrababu Naidu Oath Ceremony Live: నాలుగోసారి ఏపీ సీఎంగా చంద్రబాబు మరికొద్దిసేపట్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఉమ్మడి జిల్లా వారీగా లెక్కలు చూస్తే.. గుంటూరు, అంతరపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా మూడేసి మంత్రి పదవులు దక్కాయి. తూ.గో, ప.గో, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు రెండేసి మంత్రి పదవులు ఇచ్చారు. చిత్తూరు నుంచి చంద్రబాబు, విశాఖ, శ్రీకాకుళం నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ దక్కింది.

గన్నవరం ఎయిర్ పోర్టుకు బయల్దేరి చంద్రబాబు

Chandrababu Naidu Oath Ceremony Live: చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. కాసేపట్లో ప్రధాని మోదీ ఎయిర్ పోర్టుకు చేరుకోనుండగా.. ఆయనకు స్వాగతం పలకనున్నారు.

29 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టం - ఏంటో తెలుసా?

Chandrababu Naidu Oath Ceremony Live: 1995లో చంద్రబాబు తొలిసారి సీఎం అయిన సందర్భంగా టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. సరిగ్గా 29 ఏళ్ల తర్వాత 2024లో చంద్రబాబును ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా బలపరుస్తున్నట్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి, చంద్రబాబు వదిన, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటించారు. మంగళవారం జరిగిన సమావేశంలో పలువురు తెలుగుదేశం నేతలు ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

చంద్రబాబు కేబినెట్ - సీనియర్లు వీరే

Chandrababu Naidu Oath Ceremony Live: చంద్రబాబు మంత్రివర్గంలో పలువురు సీనియర్లకు చోటు దక్కింది. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలు గతంలో మంత్రులుగా చేసిన వారు ఉన్నారు.

చంద్రబాబు కేబినెట్ - తొలిసారి మంత్రులు వీరే!

Chandrababu Naidu Oath Ceremony Live: చంద్రబాబు మంత్రి వర్గంలో పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్థన్ రెడ్డిలు  పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి తొలిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

చంద్రబాబు మంత్రివర్గం - తొలిసారి ఎమ్మెల్యేలైన 10 మందికి చోటు

Chandrababu Naidu Oath Ceremony Live: చంద్రబాబు కేబినెట్‌లో మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి చోటు దక్కింది. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా మరో 8 మంది మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి వీరిలో ఉన్నారు.


 

చంద్రబాబు ప్రమాణ స్వీకారం - పీఎం మోదీ సహా రాజకీయ ప్రముఖులు

Chandrababu Naidu Oath Ceremony Live: కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు విజయవాడ చేరుకున్నారు. సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఇతరులు కూడా హాజరయ్యారు. ఇప్పటికే కూటమి శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణ కిక్కిరిసిపోయింది.





చంద్రబాబు ప్రమాణస్వీకారం - 36 గ్యాలరీల్లో ఎల్ఈడీ స్క్రీన్స్

Chandrababu Naidu Oath Ceremony Live: చంద్రబాబు ప్రమాణస్వీకారం ప్రాంగణంలో 36 గ్యాలరీల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. వీవీఐపీల కోసం ప్రత్యేకంగా 3 గ్యాలరీలు కేటాయించారు.

ప్రమాణస్వీకార వేదిక వద్దకు జనసేనాని పవన్ కల్యాణ్

ఏపీ సీఎంగా చంద్రబాబు మరికొద్దిసేపట్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కేసరపల్లిలోని ప్రమాణస్వీకార వేదిక వద్దకు బయలుదేరారు. సీఎంగా చంద్రబాబుతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

Background

ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఎన్డీఏ కూటమి కొలవుదీరనుంది. ఉదయం 11.27 నిమిషాలకు గన్నవరంలోని కేసరపల్లి వేదికగా సీఎంగా చంద్రబాబుతో గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. దీని కోసం భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. చంద్రబాబు నాల్గోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. చంద్రబాబుతో 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. అందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. 



ప్రమాణ స్వీకారమహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రహంమంత్రి అమిత్‌షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్రమంత్రులు, ఇతర్రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. [yt]

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.