Nara Bhuvaneshwari spent four days in Kuppam : ముఖ్యమంత్రి బాధ్యతల్లో తీరిక లేకుండా ఉండే సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా తన బాధ్యతలను ఎక్కువగా పార్టీ నేతలకు వదిలేస్తారు. అయితే ఈ సారి మాత్రం ఆయన బాధ్యతలను నారా భువనేశ్వరి కూడా తీసుకుంటున్నారు. నారా భువనేశ్వరి కుప్పం శాసనసభా నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యకర్తగా, ఈ పర్యటనలో రైతులు, మహిళలు, విద్యార్థులు, స్వయం సహాయక బృందాలతో సమావేశాలు నిర్వహించి, ప్రజా సమస్యలు విన్నారు. నేను ముఖ్యమంత్రి భార్యగా కాకుండా, టీడీపీ కార్యకర్తగా వచ్చానని చెప్పి అందరితో మమేకం అయ్యారు.
నవంబర్ 20న కుప్పంలోకి చేరుకున్న భువనేశ్వరి, మొదట గుడిపల్లి మండలంలో మహిళలతో సమావేశమయ్యారు. సోలార్ విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, అందరికీ ఇళ్లు ఇవన్నీ 6 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి 200కు పైగా పిటిషన్లు స్వీకరించారు. ఈ సమావేశంలో తమిళంలో "ఎలారిక్కి సౌగ్యమా?" (ఎలా ఉన్నారు?) అని పలకరించి, స్థానికులను ఆకట్టుకున్నారు.
నవంబర్ 21న కుప్పం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో సమావేశమయ్యారు. తన కాలేజ్ రోజులు, చంద్రబాబు, లోకేష్‌లతో జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. "సమరసింహారెడ్డి సినిమాలో 'ఒక వైపు చూడు, రెండో వైపు చూడకు' అనే డైలాగ్ లాగా, మీరు లక్ష్యంపై దృష్టి పెట్టండి" అని సలహా ఇచ్చారు. . శాంతిపురం మండలంలో స్వయం సహాయక బృందాలతో సమావేశమై, "మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత. చంద్రబాబు 40 పథకాలు ద్వారా కుప్పాన్ని అభివృద్ధి చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఉపాధి అవకాశాలు తీసుకువస్తాం" అని ప్రకటించారు. రామకుప్పం మండలంలోని చల్దిగనిపల్లిలో మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఉచిత బస్సులో ప్రయాణించారు. రామకుప్పం మండలంలో కార్యకర్తల ఇళ్లకు వెళ్లారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్ ద్వారా సంక్షేమ పథకాలు ప్రారంభించారు. గ్రామసభల్లో పాల్గొని, "కుప్పం ప్రజలు మా కుటుంబానికి 35 సంవత్సరాలుగా మద్దతు ఇచ్చారు. మీ సమస్యలు మా సమస్యలు" అని చెప్పారు. కోదండరామ స్వామి బ్రహ్మోత్సవంలో పాల్గొని, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు కుప్పం మున్సిపాలిటీలో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభఇంచారు. ఈ మూడు రోజుల్లో భువనేశ్వరి గుడిపల్లి, కుప్పం, శాంతిపురం, రామకుప్పం మండలాలను పరిశీలించారు. 500కు పైగా కుటుంబాలను పరామర్శించారు. నీటి ట్యాప్‌లు, సోలార్ ప్యానెల్స్, రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కుప్పం వస్తానని హామీ ఇచ్చారు.
నారా భువనేశ్వరి ప్రజలతో మమేకమైన విధానం టీడీపీ కార్యకర్తలనే కాదు.. సామాన్యులను కూడా ఆకర్షించింది. ఉచిత బస్సులో ప్రయాణించారు.. పాలారు నదిలో చిన్న బోటుపై విహరించారు. అందరితో కలివిడిగా ఉన్నారు.