Kerala Restaurant Completely Non Vegetarian Signboard: భారతదేశంలో ఫుడ్ కల్చర్‌కు సంబంధించిన ఒక చిన్న సైన్‌బోర్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయింది. కేరళలోని ప్రసిద్ధ రెస్టారెంట్ 'పారగాన్'లో ఏర్పాటు చేసిన 'వి ఆర్ అ్ కంప్లీట్లీ నాన్-వెజిటేరియన్ రెస్టారెంట్' అనే బోర్డు ఫోటో X (ట్విటర్)లో వైరల్ అయింది. ఈ బోర్డు వెజిటేరియన్ డిషెస్ లభిస్తాయని, కానీ అవి  మాంసం, చేపలతో పాటు కామన్ కిచెన్‌లోనే తయారు చేస్తామని స్పష్టం చేస్తోంది.   

Continues below advertisement

సోషల్ మీడియాలో వెజ్ కంటెంట్‌తో ట్రిక్ చేసే వాళ్లు వల్ల రెప్యూటేషన్ డ్యామేజ్ కాకుండా 'నాన్-వెజ్' బోర్డులు పెడటం మొదలుపెట్టాయని  నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొంత మంది పారగాన్‌ను "వరల్డ్‌లోని బెస్ట్ రెస్టారెంట్లలో ఒకటి"గా ప్రస్తావించారు. ఈ బోర్డు భారతదేశంలో 'ఓన్లీ వెజిటేరియన్' రెస్టారెంట్లు సాధారణమైనప్పటికీ, 'కంప్లీట్లీ నాన్-వెజ్' అనే డైరెక్ట్  సైన్ బోర్డ్ పెద్దగా కనిపంచదు.  

Continues below advertisement

ఈ ట్రెండ్ సోషల్ మీడియా ఔట్‌రేజ్‌కు సంబంధించినది. రెస్టారెంట్లు వెజ్ డిషెస్ పోస్ట్ చేస్తే, వాటిని మాంసం కిచెన్‌లో తయారు చేశారని తెలిసి వెజిటేరియన్లు ట్రిగర్ అవుతారని, వైరల్ వీడియోలు, రివ్యూల ద్వారా రెప్యూటేషన్ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ బోర్డును రాడికల్ ట్రాన్స్‌పరెన్సీగా చెబుతున్నారు.  

కేరళలో 85% మగవాళ్లు నాన్-వెజ్ తింటారు.  సోషల్ మీడియా ఎరా‌లో రెస్టారెంట్లు ఊహలకు బదులు "ట్రాన్స్‌పరెన్సీ"ని ఎంచుకోవాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. పారగాన్ లాంటి రెస్టారెంట్లు ఇది పాజిటివ్ మార్కెటింగ్‌గా మారవచ్చని భావిస్తున్నారు.