Tarak Ratna Health Update: బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో హీరో నందమూరి తారక రత్న చికిత్స పొందుతున్నారు. అత్యవసరం చికిత్సలో భాగంగా సీఐసీయూలో ఎక్మోపై ఉంచిన వైద్య సేవలు అందిస్తున్నారు. మరో 48 గంటలపై ఎక్మో చికిత్స అందించడంతోపాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యులు వెల్లడించారు. తారకరత్నకు డాక్టర్ ఉదయ్ నేతృత్వంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్నను చూసేందుకు ఆస్పత్రికి రాబోతున్నారు.
రాత్రి తరలింపు
అస్వస్థతకు గురైన హీరో నందమూరి తారకరత్నను కుప్పం నుంచి బెంగుళూరుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తరలించారు. మెరుగైన వైద్యం అందించేందుకు బెంగుళూరులోని ఆసుపత్రికి తరలించారు. ఎయిర్ లిప్టింగ్ చేసే అవకాశం లేనందున గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. కుప్పం నుంచి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. గ్రీన్ ఛానల్ పై కర్ణాటక ప్రభుత్వంతో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చించారని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి తెలిపారు. అంబులెన్స్ కు ఎలాంటి ఆటంకాలు రాకుండా గ్రీన్ ఛానల్ తరహాలో తారకరత్నను బెంగళూరు తరలించడానికి కర్ణాటక సర్కార్ సహకరించిందని చెప్పారు. తారకరత్న కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం బెంగుళూరుకు తరలించారు. కర్ణాటక నుంచి కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి అంబులెన్స్ లు వేకువజామున బయల్దేరి నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తారకరత్నను చేర్చాయి.
తారకరత్న ఆరోగ్యంపై లోకేశ్ ఆరా
నిన్న మొదటి రోజు కుప్పం పాదయాత్ర పూర్తి చేసుకున్న అనంతరం లోకేశ్ పీఈఎస్ ఆసుపత్రికి వచ్చి తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలు వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యపరిస్థితి సమీక్షించేందుకు బెంగుళూరు నారాయణ హృదయాలయ నుంచి ప్రత్యేక వైద్యులు బృందం కుప్పం వచ్చారు. బెంగుళూరు నుంచి వచ్చిన వైద్యుల బృందంతో లోకేశ్, బాలకృష్ణ చర్చించారు. ఐసీయూలో ఉన్న నందమూరి తారకరత్న ఆరోగ్యంపై నారా లోకేశ్, బాలకృష్ణ, దేవినేని ఉమా, ఎంపీ రామ్ మోహన్ నాయుడు ఆరా తీశారు. తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే తారకరత్న సతీమణి కుప్పం ఆసుపత్రికి చేరుకున్నారు.
గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్