Breaking News Telugu Live Updates:  వనపర్తి జిల్లా ఊక చెట్టు వాగులో ముగ్గురు గల్లంతు 

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 08 Oct 2022 07:01 PM

Background

తిరుపతి : తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది.. శుక్రవారం 07-10-2022 రోజున 70,007 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 42,866 మంది తలనీలాలు సమర్పించగా, 4.25 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.. అయితే సర్వదర్శనం...More

 వనపర్తి జిల్లా ఊక చెట్టు వాగులో ముగ్గురు గల్లంతు 

వనపర్తి జిల్లా మదనాపురం మండలం ఊక చెట్టు వాగులో ముగ్గురు గల్లంతయ్యారు. కొద్దిరోజులుగా వనపర్తి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు సరళాసాగర్ ప్రాజెక్టు ఆటోమేటిక్ సైఫాన్ వ్యవస్థ ఆన్ కావడంతో ప్రాజెక్టు వెనకాల ఉన్న వనపర్తి ఆత్మకూరు రోడ్డుపై ఊక చెట్టు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వాగును దాటే క్రమంలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతయినవారిలో ఇద్దరు ఆడవాళ్లు ఒక యువకుడు ఉన్నారు. గల్లంతైన వారికోసం మదనాపురం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.