BREAKING NEWS: కుప్పంలో దూసుకెళ్లిన వైసీపీ

ఎంతో ఉత్కంఠగా సాగిన మున్సిపల్ ఎన్నికల కౌంటిగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొన్నిచోట్ల ఓడిన అభ్యర్థులు రీ కౌంటింగ్ కోరుతున్నారు.

ABP Desam Last Updated: 17 Nov 2021 12:38 PM

Background

రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు నగర కార్పొరేషన్ సహా.. 13 మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల కౌంటిగ్ మరికొద్ది సేపట్లో మొదలవుతుంది. కౌంటింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం 8 గంటలనుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. సాయంత్రానికి పూర్తి స్థాయి ఫలితాలు...More

కుప్పంలో పోలీసుల ఆదేశాలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బేఖాతర్

తిరుపతి: కుప్పంలో పోలీసుల ఆదేశాలు బేఖాతర్. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకాలో‌ వైఎస్సార్ సీపీ పాగా వేయడంతో పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చుతున్నారు. కుప్పంలో వైసీపీ శ్రేణుల విజయోత్సవాలు అంబరాన్ని అంటాయి. జెండాలతో వైసీపీ కార్యకర్తలు రోడ్లపై హల్ చల్ చేస్తున్నారు.