వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నగరి నియోజకవర్గంలో అల్టిమేట్ లీడర్‌ను తానేనని ఎమ్మెల్యే రోజా మరోసారి నిరూపించుకున్నారు. వివాదాస్పదమైన నిండ్ర మండలాధ్యక్ష పదవిని తన వర్గానికే ఇప్పించుకున్నారు. దీంతో రోజా ప్రత్యర్థివర్గం అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు షాక్ తగిలినట్లయింది. మండల పరిషత్ ఎన్నికల్లో నిండ్ర మండలలో వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే అక్కడ మండలాధ్యక్షుడిగా శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి ఎన్నిక కావాలనుకున్నారు. కానీ నగరి ఎమ్మెల్యే మాత్రం ఆయన కాకుండా దీప అనే ఎంపీటీసీని ఖరారు చేశారు.


Also Read : ‘మా’ ఎన్నికలపై స్పందించిన రోజా.. వారికే నా ఓటు!


మండలాధ్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేల మాటకే విలువ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ నేతలకు ఆదేశాలు చేసింది. అయితే నిండ్రలో మాత్రం భాస్కర్ రెడ్డి రోజా మాటను ధిక్కరించారు. ఆ మండలంలో తన వర్గానికి చెందిన ఎంపీటీసీలే ఎక్కువగా ఉండటంతో తనే అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎమ్మెల్యే రోజా మాత్రం అంగీకరించలేదు. దీంతో రెండు సార్లు మండలాధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. రెండు వర్గాలు మీడియా ముఖంగా ఆరోపణలు చేసుకున్నాయి. భాస్కర్ రెడ్డి వర్గం ఆందోళనకు దిగింది.


Also Read : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై సీబీఐ విచారణ కొనసాగింపు.. సుప్రీంకోర్టు ఆదేశం


రోజా, చక్రపాణి రెడ్డి వర్గం మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. దమ్ముంటే నువ్వు ఇండిపెండెంట్ పోటీ చెయ్యి అని రోజా చక్రపాణి రెడ్డికి సవాల్ విసిరితే... అందుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగి తనతో తలపడాలని చక్రపాణి రెడ్డి ప్రతి సవాల్ చేశారు. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో చివరికి ఈ పంచాయతీ పార్టీ అధిష్ఠానం వద్దకు చేరుకుంది. ఎమ్మెల్యే సూచించిన మేరకే నడుచుకోవాలని ఆదేశాలు జారీ కావడంతో వ్యవహారం కొలిక్కి వచ్చింది. శుక్రవారం  నిండ్ర ఎంపీపీ ఎన్నికలు సజావుగా సాగింది.రోజా సూచించిన ఎలకాటూరు ఎంపీటీసీ సభ్యురాలు దీప ఎంపీపీగా ఎన్నికయ్యారు.


Also Read : డ్రగ్స్ స్కాంపై చేసిన ఆరోపణలకు ఆధారాలివ్వండి ..ధూళిపాళ్లకు కాకినాడ పోలీసుల నోటీసులు !


నిండ్ర మండలంలో మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి సోదరుడి కుమారుడైన చక్రపాణిరెడ్డి వైసీపీలో బలమైన నేతగా ఉన్నారు. ఇక్కడ జరిగిన మండల పరిషత్‌ ఎన్నికల్లో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఏడు వైసీపీకి, ఒకటి టీడీపీకి దక్కాయి. పార్టీ విధానం మేరకు ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థినే ఎంపీపీగా ఎన్నుకోవాలని అధిష్ఠానం ఆదేశించడంతో  చక్రపాణిరెడ్డి తాత్కాలికంగా సర్దుకుపోయినా ముందుముందు ఎలా వ్యవహరిస్తారన్నది మాత్రం నియోజకవర్గ వైసీపీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. చివరికి రోజా నియోజకవర్గంపై తన పట్టు నిరూపించుకున్నారని ఆమె అనుచరులు అంటున్నారు. 


Also Read : "మా"కు మోడీకి ఏంటి సంబంధం ? "అతి" స్థాయికి చేరిన తారల ఎన్నికల రగడ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి