Minister Nara Lokesh Bumper Offer To RTC Bus Driver: రెండు రోజుల క్రితం తుని ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తోన్న లోవరాజు అనే డ్రైవర్.. రహదారిపై ట్రాక్టర్ నిలిచిపోగా బస్సును ఆపి డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్ కావడంతో.. అతన్ని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సైతం అభినందిస్తూ ట్వీట్ చేశారు. 'డ్యాన్స్ సూపర్ బ్రదర్. ఇలానే కొనసాగించు. బస్సు ప్రయాణికులు నీ డ్యాన్స్ చూసి ఆస్వాదించినట్లు భావిస్తున్నా.' అని పేర్కొన్నారు. అయితే, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. కాగా, లోవరాజు గత పదేళ్లుగా ఆర్డీసీ డ్రైవర్‌గా చేస్తున్నాడు. అతనికి చిన్నతనం నుంచి డ్యాన్స్ అంటే ఆసక్తి. ఈ క్రమంలోనే రహదారిపై వస్తుండగా ఎదురుగా ట్రాక్టర్ నిలిచిపోవడంతో బస్సును ఆపాల్సి వచ్చింది. ఈ సందర్భంగా బస్సులో ఉన్న స్కూల్ పిల్లలు సరదాగా డ్యాన్స్ చేయాలని కోరగా అలానే చేశారు. ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.
స్పందించిన మంత్రి
ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడంతో డ్రైవర్ లోవరాజు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన ఉద్యోగంతోనే కుటుంబాన్ని పోషించుకోవాలని.. ట్రాక్టర్ ఆగిపోవడంతోనే బస్సును ఆపి డ్యాన్స్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. తన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. అయితే, డ్రైవర్‌ను సస్పెండ్ చేశారన్న విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్ స్పందించారు. డ్రైవర్ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని.. సస్పెన్షన్ ఆర్డర్స్ ఎత్తేస్తారని.. ఆయన వెంటనే తన ఉద్యోగంలో చేరొచ్చని స్పష్టం చేశారు. అలా అని చెబుతూనే మరో బంపరాఫర్ ప్రకటించారు. తాను అమెరికా నుంచి రాగానే.. డ్రైవర్ లోవరాజును పర్సనల్‌గా కలుస్తానని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్దమనసుతో డ్రైవర్‌కు అండగా నిలిచారంటూ కామెంట్స్ చేశారు.