Gudivada COmments :  చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో చేస్తున్న విమర్శలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.   వైసీపీ అధికారము లో వచ్చిన తరువాత టీడీపీ ని, చంద్ర బాబు నీ ప్రజలు నమ్మడం లేదన్నారు. చంద్రబాబు ప్రతాపం తెలంగాణ లో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారని.. త్రవాత  తర్వాత అండమాన్ నికోబార్ లేదా తమిళ నాడు వెళ్ళి పోతారన్నారు.  ఇలాంటి మనస్తత్వం కలిగిన నాయకులని పిచ్చివాళ్లు అంటారని అమర్నాథ్ విమర్శించారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని .. అందుకే తెలంగాణలో సమావేశం పెట్టారన్నారు. 


ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారు : గుడివాడ అమర్నాథ్


కోవిడ్  వాక్సిన్ టీడీపి కనిపెట్టింది అనడం దారుణమని అమర్నాథ్ అన్నారు. మోడీ ని తిట్టి, అమిత్ షా పై రాళ్ళు వేయించిన వ్యక్తీ జిమ్మిక్ లు అన్ని వాళ్ళకి తెలుసన్నారు.  ఎక్కడికి వెళ్ళినా మైక్ కూడా పట్టుకో లేక పోతున్నాడని  .. ఈ ప్రాకులట దేనికని మంత్రి విమర్శించారు.  రాజాం లో... ఉత్తరాంధ్ర కీ ఏమి చేశారు అని అడిగారని...1995లో  ముఖ్య మంత్రి అయి మీరు ఏమి చేశారని చంద్రబాబును ప్రశ్నించారు.  2019 లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయితే ఏమీ కట్టారు అని అడగటం సిగ్గు వుందా అని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర లో అడుగు పెట్టే హక్కు   చంద్ర బాబు నాయుడు కి లేదన్నారు.  విశాఖ పరిపాలన రాజధాని కి వ్యతిరేకించిన మీకు ఈ ప్రాంతం గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. 


విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ పెంచుతున్నారు :  గుడివాడ అమర్నాథ్ 


అమరావతీ రైతులని  మాపైకి  పాద యాత్ర పేరుతో దండ యాత్ర చేసే ప్రయత్నం  చేశారన్నారు.  కృత్రిమ యాత్ర లు చేయిస్తే ఎలా సక్సెస్ అవుద్ధని  అమర్నాథ్ ప్రశ్నించారు.  ఈ ప్రాంతం లో అన్నీ వ్యాపారాలు చంద్రబాబు బంధువు లు వేనని ఆరోపించారు.  జనవరి నుంచి ఏప్రిల్ వరకూ అంతర్జాతీయ సదస్సు లు విశాఖ లో జరగనున్నాయి..విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను ఈ స్థాయికి తెచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి దేనన్నారు.  సైకిల్ ని తీసి మూడు, నాలుగు చక్రాల వాహనాలు పెట్టు కోవాలని సలహా ఇచ్చారు. 


సైకిల్ జాన్సన్ లా ఉదరగొడుతున్నారు : మంత్రి అమర్నాథ్ 


బీజేపీ, జనసేనలతో పొత్తులు పెట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ేమండిపడ్డారు.  ప్రభుత్వ పై నింద మోపి రాజకీయ లబ్ధి కి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  మైకేల్ జాక్సన్ లా ఇతను సైకిల్ జాక్సన్ లా ఊదర గొడు తున్నాడని.. ఫోన్ లు కనిపెట్టా అంటాడు.2024లో అమరావతి లో ఒలింపిక్స్ అంటారని ఎద్దేవా చేశారు.  ప్రభుత్వం పై విమర్శలు మానేస్తే మంచిదని హెచ్చరించారు. సైకో అంటే సొంత తమ్ముడిని చైన్ లతో కట్టేయడమా అని నిలదీశారు.రామ్మూర్తి నాయుడు ఎక్కడున్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.