ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ) లండన్‌లో ల్యాండయిన మాట నిజమేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ( BUggana ) ప్రకటించారు. అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆయన వివరించారు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ( Gannavaram Airport )  బయల్దేరిన తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ( Istambul ) ఆగిందని బుగ్గన తెలిపారు. అక్కడ ఎయిర్‌ ట్రాఫిక్‌ ( Air Trafic ) విపరీతంగా ఉండడం వల్ల  ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగిందని తెలిపారు.   దీనివల్ల లండన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యిందన్నారు. 


దావోస్ కంటే ముందు జగన్ లండన్ వెళ్లారా? అసలు నిజం ఏమిటి ?


లండన్‌లో ( London ) కూడా ఎయిర్‌ ట్రాఫిక్‌ విపరీతంగా ఉందని... అక్కడ నుంచి బయలు దేరేలోగా సమయం రాత్రి పది గంటలు దాటిపోయిందన్నారు. జ్యూరిచ్‌లో  ( Zurich ) ల్యాండ్‌ అవడానికి ప్రయాణ షెడ్యూల్‌ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయిన తర్వాత అనుమతి ఇవ్వరని  స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు చెప్పారని బుగ్గన తెలిపారు.  రాత్రి 10 గంటల తర్వాత జ్యూరిచ్‌లో విమానాలు ( Flights ) ల్యాండింగ్‌ను చాలా సంవత్సరాల నుంచి నిషేధించిన విషయాన్ని స్విస్‌ అధికారులు భారత రాయబార కార్యాలయ అధికారులకు తెలిపారన్నారు.  ఈ విషయాలన్నీస్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు, లండన్‌లోని భారత దౌత్య అధికారులకు సమాచారం అందించారన్నారు. 


ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ


వారు నేరుగా ముఖ్యమంత్రితో ( CM ) కూడిన అధికారులతో చర్చించి.. లండన్‌లోనే ( London Stay )  వైఎస్‌ జగన్‌కు బస ఏర్పాట్లు చేశారని బుగ్గన తెలిపారు. అలాగే  తెల్లవారుజామునే జ్యూరిచ్  బయల్దేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ.. పైలట్లు ( Pilots ) ఓ రోజు అంతా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలెట్లు నిర్ణీత గంటలు విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుందని బుగ్గన తెలిపారు . అందుకే ఉదయమే బయలుదేరలేదన్నారు. 


విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !


విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు తదితర అంశాలమీద అవగాహన లేకపోవడం, దీనిమీద పనిగట్టుకుని సీఎం జగన్‌ మీద, ఆయన కుటుంబం మీద విషప్రచారం చేస్తున్నారని బుగ్గన విమర్శించారు. దావోస్ పర్యటనపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సంస్కారం లేకుండా ఉన్నాయన్నారు.