Minister Botsa: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు బోధన తప్ప మరో పని చెప్పబోమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యా కానుక కిట్ల పంపిణీని వారంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలతో చర్యల తర్వాత ఆయన పలు విషయాల గురించి తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించామని.. ప్రభుత్వ నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘాలకు వివరించామన్నారు. 82 వేలకు పైగా ఉపాధ్యాయ బదిలీలు కోరారని అన్నారు. అలాగే రాష్ట్రంలో 679 ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.


350 మంది ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా పదోన్నతి కల్పిస్తామని వివరించారు. ప్రస్తుతం 355 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. పాఠశాలల్లో రాత్రి వాచ్ మెన్ పోస్టులను ఇప్పటికే భర్తీ చేశామన్నారు. 175 ఇంజినీరింగ్ ప్రొఫెసర్లతో టీచర్లకు సాంకేతిక పరిజ్ఞానం కల్పిస్తామన్నారు. 98 మంది కంటే తక్కువ సంఖ్య ఉన్న పాఠశాలలో సబ్జెక్టు టీచర్లు లేరన్నారు. సబ్జెక్టు టీచర్లు లేని చోట విద్యార్థులను సమీప పాఠశాల్లో చేర్పించాలన్నారు. పదో తరగి, ఇంటర్మీడియ్ లో ప్రతిభ కనబరిచిన వారికి అభినందన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 20వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా విజయవాడలో అభినందన కార్యక్రమాలు చేపడుతున్నామని బొత్స వివరించారు.  


ఇటీవలే అమిత్ షాపై బొత్స ఫైర్..


కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమాయకుడని.. ఆయన ఏదేదో మాట్లాడరని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ప్రభుత్వం కుంభకోణాల మయమని ..  అమిత్ షా విశాఖలో చేసిన విమర్శలపై బొత్స స్పందించారు. అమిత్ షా  అమాయకుడు  ఏదేదో  మాట్లాడతాడు... బీజేపీ  కి  ఉన్న  ఓట్  బాంక్  ఎంత అని మీడియా  ప్రతినిధుల్ని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు మాటల్నే అమిత్ షా మాట్లాడుతున్నారన్నారు.  ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా, జీవీఎల్ మాట్లాడారని అర్ధమవుతోందన్నారు. గురివింద గింజల్లా తమ కింద మచ్చను బీజేపీ నేతలు చూసుకోవాలని బొత్స సూచించారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి ఏంటో బీజేపీ నేతలు పరిశీలించుకోవాలన్నారు. ప్రధానితో తమ బంధం ఎలా ఉందో అమిత్‌ షాతోనూ అలానే ఉందన్నారు. ఒకరితో ఎక్కువ, మరొకరితో తక్కువ లేవన్నారు.


కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పేవరకూ ఎంపీ జీవీఎల్‌కు రాష్ట్రంలో అవినీతి గురించి తెలియదా? అని  బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంతకాలం జీవీఎల్ ఎందుకు ప్రశ్నించలేదో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.  కేంద్ర  రాష్ట్ర  సంబంధాలు  చెడిపోయా యని జరుగుతన్న ప్రచారాన్నీ ఖండించారు. అలా ఎవరన్నారని.. ప్రశ్నించారు. అయితే  కేంద్రం పై  ప్రత్యేక  హోదా కు  సంబంధించి  పోరాటం  చేస్తూనే  ఉన్నామని..  పోరాటానికి  ఆకారం  ఉంటుందా అని బొత్స తనదైన శైలిలో సమర్థించుకున్నారు. గతంలో తాము  ప్రతిపక్ష  పార్టీ  గా  ఉన్నప్పుడు  కూడా  హోదా  ఆడిగామన్నారు.  మా  ఎంపీ లు  నిత్యం  పోరాటం  చేస్తున్నారని.. దేశానికి  సంబంధించి న  అంశం  వస్తే  బిల్లుల  విషయంలో   కేంద్రానికి  మద్దతు  ఇస్తున్నామన్నారు.  పవన్  కళ్యాణ్  యాత్ర  అంటే  తనకు అర్థం కావడం లేదని ..  కాశీ  యాత్ర  లాగా  వారాహి  యాత్రనా అని ప్రశ్నించారు.