ఏపీలో కరెంట్ సరఫరా పరిస్థితిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు తన నిరసనను మీమ్స్ ద్వారా బయటపెడుతున్నారు. సెటైరిక్‌గా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వివరిస్తున్నారు.  ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు.  

 కొంత మంది ఏపీలో మళ్లీ లాంతర్ల శకం వచ్చిందని తేల్చేస్తున్నారు. 

అతడు సినిమాలో క్లాసిక్ సీన్‌ను పవర్ కట్స్‌కు లింక్ పెట్టేశాడో మీమ్ క్రియేటర్ 

 

అమెజాన్‌లో ఇప్పుడు విసనకర్రలకు డిమాండ్ పెరిగిపోయిందట. ఏపీ ప్రజలకు ఇప్పుడు అది ఎంతో అవసరం అంటున్నాడో నెటిజన్

 

ఎక్కడికొచ్చాడో మర్చిపోయిన ఓ వ్యక్తికి పవర్ కట్స్‌ను బట్టి ఏపీలో ఉన్నారని తేల్చినఓ మీమ్ వైరల్‌గా మారింది. 

తెలంగాణలో ఇరవై నాలుగు గంటలూ కరెంట్ వస్తుందని సెటైర్‌గా చెప్పడానికి మీరు ఉన్నోళ్లు బ్రో అనే మీమ్ వదిలారు క్రియేటర్స్

 

సోషల్ మీడియాలో కనిపిస్తున్న అన్ని మీమ్స్ .. నవ్వు తెప్పించేవిలా ఉన్నా... పరిస్థితి తీవ్రతను కూడా తెలిపేలా ఉన్నాయి. 

 

 

పవన్ కల్యాణ్‌ని కూడా యాడ్ చేసేడో మీమర్. కరెంట్‌లో పవర్ అందుకే కట్‌ అయింది అంటూ మీమ్ క్రియేట్ చేసేశాడు.