పోలవరం కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ కంపెనీ, ఏపీలో బల్క్‌గా ఇసుక పై హక్కులు పొందిన జేపీ వెంచర్స్ సంస్థ మధ్య వివాదం తలెత్తింది. ఫలితంగా పోలవరం పనులు మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆగిపోయిననట్లుగా తెలుస్తోంది. రివర్స్ టెండింరింగ్‌లో భాగంగా 2019లో మేఘా సంస్థ పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకుంది. ఆ సమయంలో ప్రభుత్వం ఉచిత ఇసుక సరఫరాకు హామీ ఇచ్చిందని మేఘా సంస్థ చెబుతోంది. ఇంత కాలం పోలవరంకు అవసరమైన ఇసుకను ఉచితంగానే తీసుకుంటోంది. అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇసుక విధానంలో మార్పులు చేసింది. రాష్ట్రంలోని ఇసుక మొత్తాన్ని జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థకు ఇచ్చింది.
2023 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి - గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఆలస్యమయిందన్న సీఎం జగన్
ఆ సంస్థ ఇప్పుడు మేఘా సంస్థకు ఉచితంగా ఇసుక ఇవ్వడానికి నిరాకరించినట్లుగా తెలుస్తోంది. డబ్బు చెల్లించాలని కోరుతోంది. పోలవరం ప్రాజెక్టుకుపెద్ద ఎత్తున ఇసుక అవసరం. ఇసుక తీసుకోవడానికి జేపీ పవర్ వెంచర్స్ నిరాకరిచడంతో .. నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. ఉచిత ఇసుక తీసుకోవడానికి ప్రభుత్వం తమకు అనుమతి ఇచ్చిందని పత్రాలు చూపించినా జేపీ పవర్ వెంచర్స్ అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో మేఘా టిప్పర్లన్నీ వెనుదిగిరి వెళ్లిపోయాయి. పనులు ఆగిపోయాయి. మేఘా సంస్థ ప్రతినిధులు ఇసుక వివాదం విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలకు చేర వేసినట్లుగా తెలుస్తోంది.
రాష్ట్ర, ప్రభుత్వ భద్రతకు స్పైవేర్‌లు వాడుతున్నాం - వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కీలక ప్రకటన !
అయితే... గత ప్రభుత్వ హయంలో ఉచిత ఇసుక విధానం ఉండేది. ఈ కారణంగా గత ప్రభుత్వంలో పనులు చేసిన నవయుగ సంస్థకు ఇసుక ఇబ్బందులు ఎదురు కాలేదు. ఏపీలో వైఎస్ఆర్‌సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. పోలవరం హెడ్‌వర్క్స్ ప్రాజెక్ట్ లో మిగిలిన పనులుతో పాటు, హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కలిపి రూ.4,359.11 కోట్లకు పనులను మేఘా సంస్థ దక్కించుకుంది. ఆ తర్వాత వారంలోపే గతంలో ఇసుక ఉచితంగా వచ్చేదని, ఇప్పుడు తన్నుకు రూ.375 చొప్పున చెల్లించాలని, దీనికి జీఎస్టీ అధికం అని, ఇది టెండర్ డాక్యుమెంట్ పరిధిలోకి రాని పని అని, అందుకే అదనంగా 500 కోట్లు ఇవ్వాలని మేఘా లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించిందో స్పష్టత లేదు కానీ ఇంత కాలం ఉచితంగా ఇసుక తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు జేపీ వెంచర్స్ అడ్డుకుంది. దీనిపై ప్రభుత్వం రెండు సంస్థల మధ్య రాజీ కుదిర్చే అవకాశం ఉంది.