Andhra Pradesh Governor :  హీరో రాజ్ తరుణ్ లావణ్యల వివాదం ఆ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మస్తాన్ సాయి (Mastan Sai Case) ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మస్తాన్ సాయి కేసు వ్యవహారం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ వద్దకు చేరింది. మస్తాన్ సాయి కేసుపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది నాగూరుబాబు నేడు లేఖ రాశారు. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని కోరుకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం మస్తాన్ సాయి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో రోజుకో వార్తతో హాట్ టాపిక్ అయింది. 


దెబ్బతింటున్న దర్గా ప్రతిష్ట 
ట్రస్టీ కుమారుడు మస్తాన్ సాయి చేసిన నేరాలు దర్గా పవిత్రత, భద్రతను దెబ్బతీస్తాయని లావణ్య తరపు న్యాయవాది నాగూర్ బాబు లేఖలో పేర్కొన్నారు. మస్తాన్ సాయిపై ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వాటిలో మహిళల నగ్న చిత్రాలు, మాదకద్రవ్యాల కేసులు, అత్యాచారం వంటివి ఉన్నాయని ఆయన అన్నారు. భక్తుల భద్రత , దర్గా ప్రతిష్ట దెబ్బతింటుందని న్యాయవాది నాగూరు బాబు లేఖలో పేర్కొన్నారు. మస్తాన్ దర్గా ట్రస్టీ రవి రామ్మోహన్ రావు కుటుంబ ఆధిపత్యాన్ని తొలగించి ప్రభుత్వం లేదా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో దర్గాను నడిపించాలని లేఖలో వివరించారు. మస్తాన్ సాయిపై ఇప్పటివరకు ఉన్న అన్ని కేసుల వివరాలను లావణ్య న్యాయవాది నాగూర్ బాబు లేఖలో పేర్కొన్నారు.


 Also Read : Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన రాజేంద్ర ప్రసాద్ - ఇరువురి ఆత్మీయ ఆలింగనం



కేసులో పోలీసుల దూకుడు
మస్తాన్ సాయి కేసులో నార్కోటిక్స్ పోలీసులు దూకుడు పెంచారు. దీంతో ఈ కేసులో షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాదకద్రవ్యాల వీడియోలు వైరల్ అయ్యాయి. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో పెద్ద సంఖ్యలో మాదకద్రవ్యాల వాడకం వీడియోలు కనిపించాయి. దీంతో నార్కోటిక్స్ పోలీసులు డ్రగ్స్ తీసుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు.


మస్తాన్ సాయి, లావణ్యపై కూడా గతంలో డ్రగ్ కేసులు ఉన్నాయి. ఇటీవల నార్కోటిక్స్ పోలీసులు వారితో పార్టీల్లో పాల్గొన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. నార్కోటిక్స్ పోలీసులు ఇప్పటికే గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో సోదాలు చేపట్టారు. మస్తాన్ సాయి స్నేహితుడు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ పార్టీలో ఉన్న ఎనిమిది మంది అమ్మాయిలు, పది మంది అబ్బాయిల వివరాలను సేకరించే పనిలో నార్కోటిక్స్ పోలీసులు ఉన్నారు.


 Also Read : Marco OTT Release: రూ.100 కోట్లు కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్ మూవీ - ఇప్పుడు 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్, చూసి ఎంజాయ్ చేసెయ్యండి!