Andhra Pradesh Maoists Arrests: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల మావోయిస్టులు షెల్టర్ గా మార్చుని ఆజ్ఞాతంలో ఉన్నారు. ఇంటలిజెన్స్ సమాచారంతో వీరందర్నీ పోలీసులు అరెస్టు చేశారు.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారెడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 6 మంది మావోయిస్టులు హతమయ్యారు. మోస్ట్ వాంటెడ్ గా ఉన్న మాడ్వీ హిడ్మా కూడా హతమయ్యారు.  ఈ ఎన్‌కౌంటర్ తర్వాత విజయవాడ, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్‌టీఆర్ జిల్లాల్లో జరిగిన రైడ్స్‌లో 31 మంది మావోయిస్టులు, వారికి సహకరిస్తున్న వారిని  అరెస్టు చేశారు.  మావోయిస్టు డైరీలు, ఆయుధాలు సహా పలు ఆధారాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, మరిన్ని డంపుల కోసం  కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు. 

Continues below advertisement


హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత ఏపీలో పలు చోట్ల తనిఖీలు           
 
ఎన్‌కౌంటర్ సమయంలో కొంత మంది మావోయిస్టులు తప్పించుకుని పారిపోయారు. వారి కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్‌కౌంటర్ తర్వాత విజయవాడ, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్‌టీఆర్ జిల్లాల్లో OCTOPUS (ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్), గ్రేహౌండ్స్, టాస్క్ ఫోర్స్ టీమ్‌లు ఏకకాలంలో రైడ్స్ చేశాయి. విజయవాడ కానూరు న్యూ ఆటోనగర్‌లోని  భవనంలో 27 మంది మావోయిస్టులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు సోదాలు చేసి అరెస్టు చేశారు. వీరిలో 21 మంది మహిళలు, 9 మంది  మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ తిప్పిరి తిరుపతి (దేవూజీ) ప్రొటెక్షన్ వింగ్ మెంబర్లు ఉన్నారు. మిగిలినవారు సౌత్ బస్తర్ జోనల్ కమిటీ సభ్యులు.     


కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లోనూ మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్     


కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో 10 మంది మావోయిస్టు సానుభూతిపరుల్ని అరెస్టు చేశారు.  వీరి నుంచి డైరీలు, నోట్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఏపీ నగరాల్లో అరెస్టు కావడం ఇదే మొదటిసారి. మావోయిస్టు కదలికలు పీక్‌లో ఉన్నప్పుడు కూడా ఇలా జరగలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.          


ఘనంగా తమ ఉనికి చాటాలనుకుని రెక్కీ చేసిన మావోయిస్టులు           


చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బలగాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మే 2025లో నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత చార్జీ తీసుకున్న జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి (దేవూజీ) తమ ఉద్యమాన్ని పునరుజ్జీవనం చేయాలని ప్లాన్ చేశాడు. హిడ్మా ఈ ప్లాన్‌లో కీలక పాత్ర పోషించాడు. ఏపీలో కీలకమైన నేతల్ని హత్య చేయడం ద్వారా తమ ఉనికి బలంగా చాటాలనుకున్నారు. అయితే ఇంటలిజెన్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అరెస్టు చేశారు.  అరెస్టుల తర్వాత పోలీసులు విజయవాడ న్యూ ఆటోనగర్, పెనమలూరు, ఏలూరు, కాకినాడలో సోదాలు చేశారు.         


హిడ్మా డైరీ ఆధారంగా డంపులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు 


హిడ్మా డైరీలో రాసిన డంపులు  ఆయుధాలు, సరుకులు, మెడిసిన్‌లు దాచిన చోట్ల కోసం రెండు రాష్ట్రాల్లోనూ సెర్చ్ చేస్తున్నారు. ఏపీతో పాటు చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిషాలో కూడా ఫోర్-స్టేట్ సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. "మిగిలిన మావోయిస్టులు వలస కూలీల రూంలో దాక్కుని ఉండవచ్చని.. అనుమానిస్తున్నారు.