Janasena janavani : పవన్ కల్యాణ్ జనవాణికి బాధితులు తమ గోడును చెప్పుకునేందుకు తరలి వచ్చారు. విశాఖ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల వద్ద నుండి పవన్ కల్యాణ్ వివరాలు తెలుసుకున్నారు. వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ మాకు న్యాయం చేస్తుంది అని నమ్మకంతో వచ్చాము అని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు చెప్పారు. అరకు నుంచి కూడా పలువురు వచ్చి తమ భూముల్ని వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ఎలా దోచుకున్నారో వివరించారు.
అధికార పార్టీ ఎమ్మెల్సీ కుంభా రవి బాబు దొంగ డాక్యుమెంట్స్ చూపించి 200 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహారిస్తున్నరని బాధితులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన కుటుంబాలను తక్కువగా చూపి ఇలాంటి అక్రమాలు చేస్తున్నారని వారు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. అనకాపల్లి జిల్లాలో బాలిక కిడ్నాప్‌పై కుటుంబ సభ్యులు జనవాణిలో ఫిర్యాదు చేవారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాలిక వివరాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. 18 ఏళ్ల లోపు అమ్మాయిలు ఎక్కువగా కిడ్నాప్‌నకు గురవతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మైనర్ బాలికలే ఎక్కువగా మిస్ అవుతున్నారన్నారు. ఫిర్యాదులు చేస్తే... విత్ డ్రా చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు.
30 వేల పై చిలుకు అమ్మాయిలు మిస్ అవుతున్నారని ఎప్పటి నుంచో కేంద్ర నిఘా సంస్థలు చెబుతున్నాయని పవన్ అన్నారు. పోలీసు శాఖ ఎందుకు ఈ కేసు విషయంలో ముందుకు వెళ్లడం లేదన్నారు. రిట్ పిటిషన్ ఎందుకు విత్ డ్రా చేసుకోమంటున్నారని నిలదీశారు. వీరి వెనక వైసీపీ నేతలు ఉన్నారా? అని ప్రశ్నించారు. బాధితుల మీద దాడి జరిగితే ఊరుకోబోమన్నారు. వారికి జనసేన అండగా ఉంటుందని పవన్ తెలిపారు.
అలాగే దివ్యాంగుల స్కూల్ యజమాని సైతం పవన్‌కు ఓ ఫిర్యాదు చేశారు. తాను ఉషోదయ జంక్షన్ జీవీఎంసీ స్థలంలో కొంత భాగాన్ని లీజ్‌కు తీసుకొని దివ్యాంగుల స్కూల్ నడిపిస్తున్నానని దాని యజమాని జనవాణిలో ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు వేధించి... తన స్కూల్ ని కరోనా సమయంలో మూయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల పిల్లల కోసం ఉచితంగా స్కూల్ నడిపిస్తున్నానన్నారు. వైసీపీ నేతల వేధింపుల కారణంగా 200 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని పవన్ దృష్టికి యాజమాన్యం తీసుకువెళ్లింది.
మన్యంలో ముఖ్యమంత్రి బంధువులకు చెందిన షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థకు విద్యుత్ ప్రాజెక్టు ఇచ్చారనిదాని వల్ల వర్షాలుపడి నాలుగు పంచాయతీలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరంతా వచ్చి పవన్‌కు మొరపెట్టుకున్నారు. ఎల్జి పాలిమర్స్ బాధితులు కూడా పవన్ కల్యాణ్‌ను కలిశారు. అక్కడ ఉన్న ప్రజలకు చాలా రకం అయిన అంటువ్యాధులతో బాధ పడుతున్నామమని.. ఆరోగ్యశాఖ నుంచి గతంలో ఇచ్చిన మాటలు మాత్రం మాటలకే పరిమితం అయిపోయాయి కానీ బాధితులకు న్యాయం జరగలేదని ్న్నారు.
వైస్సార్సీపీ నాయకులు చేసిన శంకుస్థాపన శిలాలకే పరిమితం అయ్యాయి కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల నామరూపాలు కనిపించిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుందని బాధితులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. 350 కుటుంబాలకు ఉపాధి, హాస్పిటల్ ఇస్తాము అని ప్రభుత్వం మాట ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని పవన్ మండిపడ్డారు. విశాఖ రాజధాని అని కేకలు వేసే ముందు విశాఖ ప్రజల కష్టలు తెలుసుకొని విశాఖ విషవాయువులు లేని ప్రాంతం చేయాలని పవన్ సూచించారు.