Trains Canceled In Andhra Pradesh : రైలు ప్రయాణాలకు ముఖ్య గమనిక జారీ చేసింది దక్షిణ మధ్య రైల్వే. విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా ఈనెల 18 నుంచి ఏపీ మీదుగా వెళ్తున్న పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటిచింది. పలు రైళ్లను పూర్తిగాను... కొన్ని రైళ్లను పాక్షికంగాను రద్దు చేసినట్టు తెలిపింది. మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటన జారీ చేసింది.
పూర్తిగా రద్దయిన రైళ్లు: ఈ నెల 18 నుంచి 31 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం (17219/17220), విజయవాడ–విశాఖపట్నం (22702/22701), బిట్రగుంట–విజయవాడ (07977/07978), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238), విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07576/07500), విజయవాడ–గూడూరు (12744/12743), గుంటూరు–విశాఖపట్నం (17239/17240) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.
పాక్షికంగా రద్దయిన రైళ్లు: ఈ నెల 18 నుంచి 31 వరకు నర్సాపూర్–విజయవాడ (07863), మచిలీపట్నం–విజయవాడ (07896/07769), విజయవాడ–మచిలీపట్నం (07866/07770), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–భీమవరం టౌన్ (07283), విజయవాడ–నర్సాపూర్ (07861) రైళ్లతోపాటు.. రామవరప్పాడు–విజయవాడ మధ్య నడిచే రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేశారు.
దారి మళ్లించిన రైళ్లు
ఈ నెల 18 నుంచి 25 వరకు యర్నాకుళం–పాట్నా (22643) దారి మళ్లింపు
ఈ నెల 23 నుంచి 30 వరకు భావ్‌నగర్–కాకినాడ పోర్టు (12756) దారి మళ్లింపు
ఈ నెల 20, 22, 27, 29 తేదీల్లో బెంగళూరు–గౌహతి (12509) దారి మళ్లింపు
ఈ నెల 18, 20, 22, 23, 25, 27, 29, 30 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్–భువనేశ్వర్ (11019) దారి మళ్లింపు
ఈ నెల 18 నుంచి 31 వరకు ధన్‌బాద్–అలెప్పి (13351) దారి మళ్లింపు
ఈ నెల 23, 30 తేదీల్లో హతియా–బెంగళూరు (18637) దారి మళ్లింపు
ఈ నెల 19, 24, 26, 31 తేదీల్లో హతియా–బెంగళూరు (12835) దారి మళ్లింపు
ఈ నెల 22, 29 తేదీల్లో టాటా–బెంగళూరు (12889) దారి మళ్లింపు
ఈ నెల 21, 28 తేదీల్లో టాటా–యశ్వంత్‌పూర్ (18111) దారి మళ్లింపు
ఈ నెల 18, 25 తేదీల్లో హతియా–యర్నాకులం (22837) దారి మళ్లింపు
దారి మళ్లింపు రైళ్లు రెండు మార్గాల్లో వయా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. ప్రయాణికులు ఈ రైళ్ల రద్దు అంశాన్ని గమనించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.