Chandrababu Naidu  :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబుకు రాజకీయ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వారు చంద్రబాబును అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు.  డీఎంకే కూటమి ఇండియా కూటమిలో ఉంది. ఈ కారణంగా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ప్రమాణ స్వీకారానికి ఆయనను ఆహ్వానించలేదు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే స్టాలిన్.. సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతూ సందేశం పెట్టారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉండాలని ఆయన కోరుకున్నారు. 


 





అమెరికా కౌన్సుల్ జనరల్ లారెన్స్ జెఫర్సన్ చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. వేడుకకు హాజరు కావడాన్ని ఓ గౌరవంగా ఆయన చెప్పుకున్నారు. 


 





ఒడిషా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.  





ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్  మహింద్రా తెలుగులో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. 


 





పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా చంద్రబాబుకు అభినందనలు తెలిాపారు.