Mansas Trust: మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్, బోర్డు సభ్యులుగా ఎవరిని నియమించినా పర్లేదు...కానీ

మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్, బోర్డు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ట్రస్టు ఛైర్మన్ అశోక్ గజపతి రాజు ప్రకటించారు.

Continues below advertisement

మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌, బోర్డు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించినా ఎలాంటి అభ్యంతరం లేదని ట్రస్టు ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు తెలిపారు. అయితే ట్రస్టు ఆనవాయితీలను పాటించాలని సూచించారు. ట్రస్టు బోర్డు సభ్యులుగా మహిళలనే తీసుకుంటే అభ్యంతరం ఏముంటుదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టు బోర్డులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ట్రస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరికాదన్నారు. రాజకీయాలతో లేనటువంటి ట్రస్టుపై ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నించారు. వైకాపా అధికారంలోకి రాగానే మాన్సాస్ ట్రస్టు భూములపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తుందని అశోక్ గజపతిరాజు అన్నారు. తనను జైలుకు పంపిస్తానని అంటున్నారని, బెయిల్‌పై వచ్చిన వారికి జైలు అంటే ఇష్టమై ఇలా వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. 

Continues below advertisement

ఈవో వైఖరి మారలేదు 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టు బోర్డులకు వ్యతిరేకం కాదని అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. కానీ ట్రస్టు ఆనవాయితీ కొనసాగించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. సింహాచలం దేవస్థానానికి చెందిన 800 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు ఆరోపిస్తున్నారన్నారు. వైసీపీ పెద్దలు భూములపై పడి సర్వేలు చేస్తున్నారన్నారు. మాన్సాస్ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు వైఖరి కూడా మారలేదని అశోక్ గజపతి రాజు అన్నారు. 

Also Read: Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు: చిరు.. నాగ్.. రికార్డులను బ్రేక్ చేసిన ఎన్టీఆర్, టీఆర్పీ అదుర్స్!

టీడీపీ నేతల అరెస్టులు ఎందుకు?

మాన్సాస్‌ ట్రస్ట్‌ విద్యార్థులకు బోధనా ఫీజులు ఇవ్వడంలేదని అశోక్ గజపతిరాజు ఆక్షేపించారు.  ట్రస్టు వ్యవహారంతో సంబంధంలేని టీడీపీ నేతలను పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. సింహాచలానికి చెందిన 800 ఎకరాలు మాయమైనట్లు వైసీపీ పెద్దలు ఆరోపిస్తున్నారని, భూములపై సర్వే చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని అశోక్ గజపతి రాజు అన్నారు. వైసీపీ పెద్దలు భూములపై పడ్డారని, అందుకే సర్వేలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలని ఉత్తరాంధ్ర రక్షణ వేదికలో నిలదీశామన్నారు. 

ప్రజల ఆస్తి

మాన్సాస్‌ ప్రైవేటు ఆస్తి కాదని ప్రజల ఆస్తి అని ఎంపీ విజయసాయిరెడ్డి తెలుసుకోవాలని మాన్సాస్‌ ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు అన్నారు. మాన్సాస్‌ నిర్వహణ సక్రమంగా లేనందునే న్యాయస్థానాన్ని ఆశ్రయించానన్నారు. హైకోర్టు తీర్పు పూర్తిగా తెలుసుకోవాలన్నారు. సింహాచలం భూములు 800 ఎకరాలు మాయమయ్యాయని విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారని, అధికారంలో ఉన్నందున సర్వే నంబర్లతో సహా బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. 

 

Also Read: నేడు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో టాలీవుడ్ పెద్దలు భేటీ.. నాగార్జున హాజరు డౌటే!

Continues below advertisement