Manchu lakshmi On Pawan : మొన్న జగన్ ఇవాళ పవన్ కల్యాణ్ - మంచు లక్ష్మి కావాలనే ట్రోల్ చేస్తున్నారా ?

పవన్ కల్యాణ్‌ను ట్రోల్ చేస్తూ వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరుడు పెట్టిన ఓ పోస్ట్ ను మంచు లక్ష్మి షేర్ చేశారు. తనకెంతో గర్వంగా ఉందని చెప్పారు.

Continues below advertisement


Manchu lakshmi On Pawan :   పవన్ కల్యాణ్ ఫోటో పక్కన తన ఫోటో ఉండటం తనకు ఎంతో ధ్రిల్ కలిగించిందని మంచు లక్ష్మి పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి మంచు లక్ష్మి పవన్ కల్యాణ్‌పై ఎంతో గౌరవంతోనే ఆ పోస్ట్ పెట్టారు. కానీ ఆమె షేర్ చేసిన కంటెంట్ మాత్రం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టేలా ఉంది. దాంతో మంచు లక్ష్మిపై పవన్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. 

Continues below advertisement

పవన్ కల్యాణ్ ఇటీవల మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారని.. ఇరవై ఏళ్ల తర్వాత  అలాంటి అవసరం వచ్చిందని చెబుతూ ఓ ఫోటో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్‌సీపీ నాయకులు రకరకాలుగా సెటైర్లు వేస్తున్నారు. వారిపై జనసేన నాయకులు విరుచుకుపడుతున్నారు. ఇలా ఓ వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరుడు.. గతంలో మంచు లక్ష్మి ఇచ్చిన అలాంటి స్టిల్ ఫోటోను వెలికి తీసి.. పవన్ కల్యాణ్ పక్కన పెట్టి.. పవన్ కల్యాణ్ మంచు లక్ష్మిని కాపీ కొట్టారని మీమ్ తయారు చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

[ఈ పోస్ట్ పవన్ కల్యాణ్ ను కించపరిచేలా ఉంది. అయినప్పటికీ మంచు లక్ష్మి పెద్దగా పట్టించుకోకుండా..  పవన్ కల్యాణ్ పక్కన ఫోటో ఉంచి మీమ్ తయారు చేయడం ధ్రిల్లింగ్ ఉందంటూ..  ఆ ట్వీట్‌ను షేర్ చేసుకుంటూ కామెంట్ చేశారు. 

మంచు లక్ష్మి తీరు సహజంగానే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను ఆగ్రహానికి గురి చేసింది. వారు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 

ఇటీవలి కాలంలో మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్ పోస్టులను ఎక్కువగా షేర్ చేస్తున్నారు. ఎవరమన్నా పట్టించుకోవడం లేదు. కొద్ది  రోజుల కిందట సీఎం  జగన్ ను ట్రోల్ చేస్తూ పెట్టిన పోస్ట్ చేసి.. లోల్ అంటూ వెటకారం చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ వంతు. 

Continues below advertisement