Nara Lokesh : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కనుసైగ చేస్తే చాలు వంద వైసీపీ ఆఫీసులు తగులబెడతామని తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ హెచ్చరించారు. గన్నవరం పరిణామాలపై చిత్తూరు జిల్లా పాదయాత్రలో ఆయన మాట్లాడారు. గన్నవరం టిడిపి ఆఫీసు తగలబెడితో నో కేస్ ..లోకేష్ స్టూలు ఎక్కి మాట్లాడితే కేస్... నాపై దాడికి వైసీపీ కత్తులు, కర్రలతో వస్తే నో కేస్.. నేను మాట్లాడితే కేస్ అని మండిపడ్డారు. ఒక్క టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే వంద వైసీపీ ఆఫీసులు తగులబెడతామన్నారు. టీడీపీ ఆఫీసులపై దాడి చేసిన వాళ్లను డ్రాయర్లతో నడి రోడ్డుపై ఊరేగిస్తామని హెచ్చరించారు.
లోకేష్ పాదయాత్ర యేర్పేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్దకు చేరుకున్న సమయంలో ఉద్రిక్తత ఏర్పడింది. లోకేష్పై దాడి చేసేందుకు వైసీపీ మూకల ఏర్పాట్లు చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ ఫిర్యాదుతో వైసీపీ నేతలతో పోలీసులు మాట్లాడి వచ్చారు. వైసీపీ నేతలతో మాట్లాడామని ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు చెప్పారు. పాఠశాలలో వైసీపీ నేతలకు ఏం పని అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. లోకేష్ పర్యటనకు రక్షణగా వచ్చారా?.. వైసీపీ నేతలకు కాపలాగా వచ్చారా? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. వజ్ర వాహనాన్ని కూడా పాదయాత్రలో ఉంచుతున్నారు. అయితే దాడులు చేయాలనుకున్న వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు చర్యలు తీసుకుంటే ఎవరూ దాడులకు చేయడానికి ముందుకు రారని టీడీపీ కార్యకర్తలంటున్నారు.
మరో వైపు నారా లోకేష్ పాదయాత్ర ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు బెల్టు షాపులు లేవన్న సీఎం జగన్ ప్రకటనలు అబద్దమని చెబుతూ.. ఓ బెల్ట్ షాప్ వద్ద సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.