Lokesh :  టిడిపి అధినేత చంద్ర‌బాబుని త‌ప్పుడు కేసులో అక్ర‌మ అరెస్టు చేయించిన సైకో జ‌గ‌న్ తీరుపై దేశ‌మంతా చ‌ర్చ‌కు వ‌చ్చేలా చేసిన టిడిపి ఎంపీల‌ను టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అభినందించారు. ఢిల్లీలో పార్టీ ఎంపీల‌తో శుక్ర‌వారం ఆయ‌న స‌మావేశం అయ్యారు. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్టుని పార్ల‌మెంటులో చ‌ర్చ‌కి తెచ్చి, దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీలు గ‌ట్టి పోరాటం చేశార‌ని ప్ర‌శంసించారు. వైకాపా ఎంపీల హేళ‌న‌లు, మాట‌ల దాడుల‌ని త‌ట్టుకుని స‌మ‌ర్థ‌వంతంగా తెలుగుదేశం వాణిని పార్ల‌మెంటులో వినిపించార‌ని కొనియాడారు. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌, అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో ఎంపీలు కేశినేని నాని, గ‌ల్లా జ‌య‌దేవ్, కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ పాల్గొన్నారు.


నంబీ నారాయణ్‌ ఉదంతంతో పోల్చి సభ దృష్టికి తీసుకెళ్లిన రామ్మోహన్ నాయుడు


టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్ సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబినారాయణ్ అక్రమ కేసులను ఉటంకించారు. గురువారం లోక్ సభలో ఆయన మాట్లాడుతూ... నంబి నారాయణ్‌ను తప్పుడు కేసులతో ఎలా అయితే నిర్బంధించారో తమ పార్టీ అధినేతను కూడా అలాగే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఎంతోమంది యువనాయకులకు స్ఫూర్తినిచ్చిన చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు పెట్టారన్నారు. రూ.43వేల కోట్లను దోచుకున్న నాయకుడు బెయిల్ పై వచ్చి పదేళ్లయినందుకు కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.                             


న్యాయపోరాటంపై నిపుణులతో చర్చలు                            


చంద్రబాబును జైల్లో పెట్టిన తర్వాత ఢిల్లీ వచ్చిన నారా లోకేష్  బీజేడీ, శివసేన, హర్యానా డిప్యూటీ సీఎం వంటివారు నారా లోకేష్ కు సంఘీభావం తెలియజేశారు. మొదటి రెండురోజులు లోకేష్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక ప్రణాళిక ప్రకారం బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారనే విషయాన్ని వివరించారు.ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్‌ను హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, బీఎస్పీ ఎంపీలు కున్వాల్ డానిష్ అలీ, రితేష్ పాండే, మహారాష్ట్ర సీఎం తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే, బీజేడీ ఎంపీ పినాకీ మిశ్రా తదితరులు కలిసి, సంఘీభావం తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవాలివీ అంటూ నారా లోకేశ్ వారికి పుస్తకాల్ని అందించారు.                                           


 తర్వాత న్యాయనిపుణులతో చర్చలు సాగిస్తున్నారు. చంద్రబాబును సుదీర్ఘంగా జైల్లో ఉంచే కుట్రను ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నారని లోకేష్ భావిస్తున్నారు.