Lawyer Ponnavolu Sudhakar Reddy : వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేత, లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో పందికొవ్వు కలపలేదని ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఎందుకంటే..  నెయ్యి కంటే పంది కొవ్వు రేటు చాలా ఎక్కువ అన్నారు. వైవీ సుబ్బారెడ్డి తరపున సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూ కల్తీ అంశంపై పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ వాల్యూ తగ్గిలందంటే .. కల్తీ జరిగిందని అర్థం కానీ.. ఆ కల్తీ  పంది కొవ్వు కాదని ఆయన అంటున్నారు. అంటే కల్తీ జరిగిందని వైసీపీ లాయర్ కూడా నిర్ధారించినట్లయింది. 


నెయ్యి కంటే ఖరీదైనది యానిమల్ ఫ్యాట్           


అదే సమయంలో పందికొవ్వు కేజీ రూ. 1450 వరకూ ఉంటుందని.. కానీ నెయ్యి మాత్రం రూ. నాలుగు వందలు మాత్రమేనన్నారు. ఎవరైనా  రూ. నాలుగు వందలు మాత్రమే ఉన్న నెయ్యిలో రూ. పధ్నాలుగు వందల విలువ చేసే పందికొవ్వును కలుపుతారా అని  ప్రశ్నించారు. రాగి చెంబులో ఎవరైనా బంగారాన్ని కలుపుతారా..  ఇత్తడిలో ఎవరైనా  గోల్డ్ కలుపుతారా అని ప్రశ్నించారు. లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


'శ్రీవారి భక్తులూ ఈ మంత్రం జపించండి' - భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి


రాగిలో ఎవరైనా బంగారం కలుపుతారా ?           


ఆయన మరో పోలిక కూడా తెచ్చారు. రాగిలో ఎవరైనా బంగారం కలుపుతారా అని కూడా ప్రశ్నించారు. అంటే.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం రాగి.. పందికొవ్వు బంగారమా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు.  లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలనే తాను వైవీ సుబ్బారెడ్డి తరపున  హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. ఏపీ ప్రభుత్వం  వేసిన సిట్‌తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదని.. ఆయన  యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు కాబట్టి చంద్రబాబు కింద పనిచేసే ఏజెన్సీలు అవే చెబుతాయన్నారు.  దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో  ఫుడ్ టెక్నాలజీ నిపుణులతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును కోరుతున్నామన్నారు.  



Also Read: Tirupati Laddu Row: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌లు- సమగ్ర విచారణ కోరిన వైసీపీ, బీజేపీ నేతలు




ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన 10 ట్యాంకులలో నాలుగు ట్యాంకుల్లో కల్తీ ఉందని.. ఈ ట్యాంకులలో  వనస్పతి ఉందని మొదట టీటీడీ ఈవో చెప్పారని పొన్నవోలు చెప్పారు.  ట్యాంకులు ముందుగానే ఒక సర్టిఫికెట్‌తో  తిరుమలకు వస్తాయని, ఆ వచ్చిన ట్యాంకులను టీటీడీ 3 పరీక్షలు నిర్వహిస్తుందని .. ఆ టెస్టుల్లో పాసయితేనే... లడ్డూల తయారీకి వినియోగ్సాతరన్నారు. టెస్టుల్లో ఫెయిల్ అయితే వెనక్కి  పంపిస్తారన్నారు. తిరుమలలో నెయ్యిని  టెస్టు చేసే ల్యాబులు లేవని చెప్పారని..త కానీ ఉన్నాయని పొన్నవోలు వాదించారు.