MLA Arthur Serious Comments On YSRCP: వైఎస్‌ఆర్‌సీపీ అధినాయకత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్దర్‌ సంచలన విమర్శలు చేశారు. ఎస్సీ నియెజకవర్గంలో రెడ్డి ఇంఛార్జిగా , సమన్వయకర్త ఉంటారని ఎక్కడ గెలిచే ఎమ్మెల్యేలకు ఎలాంటి అధికారాలు ఉండవని ఆరోపించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దన్‌ను తప్పించిన అధినాయకత్వం అక్కడ వేరే లీడర్‌ను ఇంఛార్జిగా చేసింది. 


నందికొట్కూరు ఇంఛార్జిగా డాక్టర్ సుధీర్ దారా


నందికొట్కూరు ఇంఛార్జిగా డాక్టర్ సుధీర్ దారాకు అవకాశం ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆర్దర్‌ను తప్పించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... అధినాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తన నియోజకవర్గంలో పేరుకే ఎమ్మెల్యేగా ఉంటున్నానని అన్నారు. పెత్తనం అంతా బైరెడ్డిదేనంటూ ఆరోపించారు. 


ఎస్సీ ఎమ్మెల్యేలకు నో పవర్స్


ఇలా ఎస్సీ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉందన్నారు ఆర్దర్. అదే విషయంపై అధినాయకత్వాన్ని ప్రశ్నించినందుకు టికెట్ నిరాకరించారని ఆరోపించారు. చాలా దళిత నియెజకవర్గాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఎమ్మెల్యేగా అధికారాలు ఇస్తేనే టిక్కెట్ ఇవ్వాలని తేల్చి చెప్పినట్టు వివరించారు. 


అధికారాలు లేకుంటే పని ఎలా చేసేది


నాలుగేళ్లుగా జగన్‌ను నమ్ముకున్నానని.. మా మనోభావాలను, అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని అడిగానన్నారు. మాజీ ప్రభుత్వ అధికారి అయిన నా నియెజకవర్గంలోనే వేరే వ్యక్తులది పెత్తనం ఉందన్నారు. తాను ఏమీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. జిల్లా కోఆర్డినేటర్, ఐ ప్యాక్ ప్రతినిధితో మాట్లాడినప్పుడు అంతా బాగానే ఉందని చెప్పారన్నారు ఆర్దర్. అడ్మినిస్ట్రేషన్ వేరేవాళ్లు చూసుకుంటారు పేరుకే మీరు ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పినట్టు వివరించారు. డిసెంబర్ 2022లోనే సజ్జల రామకృష్ణ రెడ్డిని కలిసి ఈ విషయాలపై మాట్లాడినట్టు తెలిపారు. 20 గ్రామాల్లో గడప గడపకు కార్యక్రమం పూర్తి కాలేదని పూర్తి స్థాయి అధికారాలు ఇస్తే వాటిని కంప్లీట్‌ చేస్తానంటూ వివరించామన్నారు. 


వద్దని చెప్పేశా


ఐప్యాక్ దివాకర్ రెడ్డి, రామసుబ్బారెడ్డికి సజ్జల రామకృష్ణ రెడ్డికి ఇదే విషయం చెప్పాను అన్నారు ఆర్దర్. పవర్స్ లేనప్పుడు ఉండలేను అని చెప్పానన్నారు. ఇలా చేస్తే నమ్ముకున్న వారికి న్యాయం చేయాలేనని తెలిపారు. నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలంటే అధికారాలు ఉండాలని కనీసం ఎమ్మెల్యేగా గుర్తింపు ఉండాలన్నారు. 


నందికొట్కూరు టికెట్ ఎందుకు తనకు ఇవ్వలేదో సరైన కారణం చెబితే తానే తప్పుకొని కొత్త వ్యక్తిని ప్రమోట్ చేస్తామని వివరించినట్టు తెలిపారు. అసలు ఉద్దేశం ఏంటో చెప్పాలని అన్నారు. ఎస్సీ నియెజకవర్గంలో వైసీపీలో రెడ్డి ఇంచార్జి ఉంటారని... సమన్వయకర్త కుడా వాళ్లే అన్నారు. ప్రతి రోజూ ప్రజలతో ఉంటానని... నిన్న టిక్కెట్ ఇవ్వడం లేదని ప్రకటించాక కుడా కార్యకర్తలతో ఉన్నానని తెలిపారు.