YSR kadapa District MLA Candidates Winner List 2024: కడప జిల్లాలో సైకిల్ స్పీడ్‌కి వైసీపీ లీడర్లు కకావికలమైపోయారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు ఎగిరిపోయారు. ఇద్దరు మినహా మిగతావారంతా కౌంటింగ్ ప్రారంభమైన కాసేపటికే అస్సాం ట్రైన్ ఎక్కేశారు. గెలుపు అవకాశాలు లేకపోవడంతో కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఏడు స్థానాల్లో ఐదింటిని ఎగరేసుకుపోయింది టీడీపీ కూటమి.
| నియోజకవర్గం | విజేత | పార్టీ |
| బద్వేలు | డాక్టర్ దాసరి సుధ | వైసీపీ |
| మైదుకూరు | పుట్టా సుధాకర్ యాదవ్ | టీడీపీ |
| కమలాపురం | పుత్తా చైతన్య రెడ్డి | టీడీపీ |
| జమ్మలమడుగు | ఆదినారాయణరెడ్డి | టీడీపీ |
| పులివెందుల | వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి | వైసీపీ |
| ప్రొద్దుటూరు | వరదరాజుల రెడ్డి | టీడీపీ |
| కడప | మాధవిరెడ్డి | టీడీపీ |
వైఎస్‌ఆర్ కడప జిల్లా
రాయలసీమలో మరో కీలక జిల్లా వైఎస్‌ఆర్ కడప జిల్లా. ఈ జిల్లా తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి, ఆ తరువాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వస్తోంది. గడిచిన మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్, ఆ తరువాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకుంటూ వచ్చింది. ఈ జిల్లాలో కడప పార్లమెంట్ స్థానం ఉంది. మొత్తంగా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, గడిచిన మూడు ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను టీడీపీయేతర పార్టీలే దక్కించుకున్నాయి.
2009లో కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించగా, 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ మొత్తం స్థానాలను గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసింది. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ వైసీపీ మరోసారి ఈ జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసింది. అలాగే, 2010లో జరిగిన ఉప ఎన్నిక ఏకగ్రీవం కాగా, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ జిల్లాలోని ఓటర్లు తొలి నుంచి వైఎస్‌ఆర్‌కు అండగా ఉంటూ వస్తున్నారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మళ్లారు.
2024 ఎన్నికల్లో పూర్తిగా మారిన రాజకీయంతాజాగా జరిగిన 2024 ఎన్నికల్లో చాలా వరకు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని, మెజార్టీ స్థానాల్లో తామే విజయం సాధిస్తామన్న ధీమాను టీడీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వైఎస్‌ఆర్ కుటుంబంలో వచ్చిన చీలిక తమకే మేలు చేస్తుందన్న భావనలో కూటమి నాయకులు ఉన్నారు. ఇదిలా, ఉంటే కడప పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్‌ఆర్ కుమార్తె షర్మిలో పోటీలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి పోటీ చేశారు. ఇదిలా, ఉంటే గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. రెండు శాతానికి మించిన పెరిగిన ఓటింగ్ ఎవరికి మేలు చేస్తుందో చూడాల్సి వస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాల్లో 77.81 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఈ ఎన్నికల్లో 79.57 శాతం మేర పోలింగ్ శాతం పెరిగింది.
వైఎస్‌ఆర్ కడప జిల్లా
|
| 2009 | 2014 | 2019 |
| బద్వేలు | కాంగ్రెస్ | వైసీపీ | వైసీపీ |
| మైదుకూరు | కాంగ్రెస్ | వైసీపీ | వైసీపీ |
| కమలాపురం | కాంగ్రెస్ | వైసీపీ | వైసీపీ |
| జమ్మలమడుగు | కాంగ్రెస్ | వైసీపీ | వైసీపీ |
| పులివెందుల | కాంగ్రెస్ | వైసీపీ | వైసీపీ |
| ప్రొద్దుటూరు | టీడీపీ | వైసీపీ | |
| కడప | వైసీపీ | వైసీపీ |