Andhra Pradesh News | తాడిపత్రి: అక్రమ కట్టడాలకు నోటీసులు కూడా ఇవ్వకుండా జెసీబీతో కొలుస్తామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో యాడికి అభివృద్ధి చెందాల్సిన ప్రాంతమని అన్నారు. కానీ మండల కేంద్రంలోని కుంటలో దేవస్థానానికి చెందిన స్థలాలలో అక్రమ కట్టడాలు కడుతున్నారని, కట్టవద్దని సూచించారు. నిర్మాణాల్లో తమ వాళ్ళు ఉన్న వదిలేది లేదన్నారు. యాడికి అభివృద్ధి తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.
JC Prabhakar Reddy: నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమ కట్టడాలు కూలుస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి
Ravi Teja | 11 Jan 2025 10:35 AM (IST)
తాడిపత్రి నియోజకవర్గంలో తనకు అభివృద్ధి ముఖ్యమని, అక్రమ నిర్మాణాలు గుర్తిస్తే నోటీసులు సైతం ఇవ్వకుండా కూల్చివేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమ కట్టడాలు కూలుస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి