Chandrababu Arrest Live Updates: విజయవాడ కోర్టులో చంద్రబాబు, కొనసాగుతున్న వాదనలు - కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
నంద్యాలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ చుట్టూ పోలీసులు మోహరించారు
చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తూ.. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోర్టును కోరారు. ఈ మేరకు నోటీసు ఇచ్చారు. 409 సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లుథ్రా వాదించారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని లుథ్రా వివరించారు. రిమాండ్ రిపోర్టు తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు.
విజయవాడ ఏసీబీ కోర్టులో గత మూడు గంటల నుంచి వాదనలు జరుగుతున్నాయి. సీఐడీ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించి సంస్థ తరపు న్యాయవాది పి.సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లుత్రా వాదనలు వినిపించారు. అనంతరం కోర్టులో స్వయంగా చంద్రబాబు వాదనలు వినిపించారు. తన అరెస్టు అక్రమమని చంద్రబాబు కోర్టుకు చెప్పారు. స్కిల్ డెవలప్ మెండ్ స్కామ్‌తో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.
విజయవాడ ఏసీబీ కోర్టుకు ఏపీ సీఐడీ రిమాండ్ రిపోర్టును సమర్పించింది. 2021 ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోయినప్పటికీ, తాజా ఎఫ్ఐఆర్ రిపోర్టులో చంద్రబాబు పేరు చేర్చి రిమాండ్ రిపోర్టును కోర్టుకు ఇచ్చారు.
విజయవాడ కోర్టులో చంద్రబాబును సీఐడీ అధికారులు హాజరు పరిచారు. చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరపున ఏఏజీ పి.సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇరు పక్షాల వాదనల తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుదన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
చంద్రబాబును ఆస్పత్రికి తరలింపు సమయంలో పెద్దఎత్తున కార్యకర్తల నినాదాలు - ఒక దశలో చంద్రబాబు కాన్వాయ్‍ను అడ్డుకున్న టీడీపీ నేతలు - కార్యకర్తలు చేతులు జోడించి నమస్కరిస్తూ వెళ్ళిన చంద్రబాబు
న్యాయస్థానం వద్దకు చేరుకున్న నారా లోకేశ్, నారా భువనేశ్వరి న్యాయవాదులతో మాట్లాడుతున్నారు.
సీఐడీ సిట్ కార్యాలయానికి చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా చేరుకున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు తరపున వాదనలు వినిపించనున్నారు. మరోవైపు గత 4 గంటలుగా సిట్ అధికారులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.
ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్టేషన్ బెయిల్ పై విడుదలయ్యారు. నేటి ఉదయం 9 గంటలకు గంటాను పోలీసులు అరెస్ట్ చేశారు.
చంద్రబాబును సిట్ అధికారులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాల్సి ఉంది. అయితే జడ్జి కోర్టు నుంచి వెళ్లిపోయారని సమాచారం.
హైదరాబాద్ నుంచి బయలుదేరిన బాలకృష్ణ, బ్రాహ్మణి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు కుటుంబసభ్యులు సిట్ ఆఫీసులో వేచి చూస్తున్నారు. సిట్ అధికారులు వారిని కింది ఫ్లోర్ కూర్చోబెట్టగా, 5వ అంతస్తులో చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసు గురించి ఆరా తీస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కు నిరసనగా తణుకు నరేంద్ర సెంటర్లో తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో కాగడాల నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. తణుకు పట్టణంలో ఉన్న అన్ని వ్యాపార దుకాణాలు అన్ని సంఘాలు దుకాణాలు కట్టేసి సంఘీభావం తెలిపారని అన్నారు. చంద్రబాబు మీద అక్రమ కేసులు పెట్టడానికి కథలో రాజశేకర్ రెడ్డి కూడా ప్రయత్నించాడని కానీ అది సాధ్యపడలేదని ఇప్పుడు కూడా అలాగే కడిగిన ముత్యం లాగా చంద్రబాబు నాయుడు బయటికి వస్తారని అన్నారు
చంద్రబాబు నాయుడు మీద అక్రమంగా కేసులు పెట్టారని అవి ఉప సహరించుకోవాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నం:
రాత్రి 07:30కి టీడీపీ నేతలకు ఖరారయన గవర్నర్ అపాయింట్‌మెంట్...
విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్ ను కలవనున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని పార్టీ నేతల బృందం
చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులను Sit కార్యాలయం లోకి అనుమతించారు. సీఐడీ అధికారులు చంద్రబాబును చూసేందుకు భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్, మరికొందరు కుటుంబసభ్యులను సిట్ ఆఫీసులోకి పంపించారు. మరోవైపు బాలకృష్ణ హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు.
SIT ఆఫీసులోకి చంద్రబాబు అడ్వకెట్లను అనుమతించని పోలీసులు
అధికారుల తీరుపై అడ్వకేట్ ల తీవ్ర అభ్యంతరం
ప్రభుత్వ అడ్వకెట్లను అనుమతించి.... చంద్రబాబు లాయర్లు నలుగురిని నిలిపివేయడంపై ఆగ్రహం
ఉదయం అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్నిటిలో నిబంధనలకు విరుద్ధం గా దర్యాప్తు అధికారులు పని చేస్తున్నారని ఆరోపణ
అడ్వకేట్లను ఏ నిబంధనల ప్రకారం, ఎందుకు అనుమతించడం లేదో చెప్పాలంటూ డిమాండ్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును పరామర్శించేందుకు విజయవాడ వెళ్లాలనుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు చేదు అనుభవం ఎదురైంది. డీజీసీఏ నుంచి అనుమతి తీసుకున్నా సైతం పవన్ కళ్యాణ్ ను బేగంపేట విమానాశ్రయంలో అడ్డుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో పవన్ గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లాలని భావించారు. కానీ ఏపీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని పోలీసులు పవన్ విమానానికి చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని కృష్ణా జిల్లా పోలీసులు తెలపడంతో బేగంపేట విమానాశ్రయం నుంచి ఫ్లైట్ టేకాఫ్ కాలేదు. పోలీసుల రిక్వెస్ట్ తో ఎయిర్ పోర్ట్ అధికారులు పవన్ ప్రత్యేక విమానం గన్నవరం వెళ్లడానికి టేకాఫ్ చేయనీయలేదు. దాంతో పవన్ నిరాశగా వెనుదిరిగారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబును పోలీసులు తాడేపల్లికి తరలించారు. కుంచనపల్లి సిట్ కార్యాలయానికి చంద్రబాబు కాన్వాయ్ చేరుకుంది. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. టీడీపీ అధినేత తరలింపుతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందే సిట్ ఆఫీసులో చంద్రబాబును విచారించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. చంద్రబును తరలిస్తున్న మార్గంలోనూ రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని సీఐడీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ నేతలు న్యాయపరంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించేందుకు సుప్రీం సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుధ్రా విజయవాడ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న సిద్ధార్థ లూధ్రా అండ్ టీమ్ .. కోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధమయింది.
అరెస్టయిన చంద్రబాబును పోలీసులు తాడేపల్లిలోని కుంచనపల్లికి తరలించనున్నారు. సిట్ ఆఫీసులో చంద్రబాబును విచారించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. టీడీపీ అధినేత తరలింపుతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబును తరలిస్తున్న మార్గంలోనూ రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
టీడీపీ నేతలు గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని గన్నవరం పీఎస్ కు తరలించినట్లు తెలుస్తోంది.
విజయవాడ దుర్గమ్మను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. చంద్రబాబును అరెస్టు చేసి విజయవాడ తీసుకొస్తున్న వేళ ఆయన్ని కలిసేందుకు భువనేశ్వరి విజయవాడ చేరుకున్నారు. విజయవాడ చేరుకున్న ఆమె ముందుగా దుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రజల తరుపున పోరాటం చేస్తున్న చంద్రబాబును రక్షించాలని అమ్మవారిని వేడుకున్నట్టు ఆమె తెలిపారు. ప్రజలే చంద్రబాబును కాపాడుకుంటారని... అంతా చేయి చేయీ కలిపి కదలాల్సిన టైం వచ్చిందని అభిప్రాయపడ్డారు.
సీఐడీ అదుపులో ఉన్న తన తండ్రి చంద్రబాబును చూసేందుకు లోకేష్‌కు పోలీసుసు అనుమతి ఇచ్చారు. ఉదయం నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేశారని తెలిసిన వెంటనే లోకేష్ పాదయాత్రకు విరామం ఇచ్చి బయల్దేరారు. అయితే ఆయన వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అడ్డుకున్నారు. దీనిపై లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. తన తండ్రిని చూసేందుకు కూడా అనుమతి లేదా అని విమర్శించారు.
చంద్రబాబు అరెస్టును ఖండించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమే – ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి అరెస్ట్ సరికాదు – ఏ తప్పూ చేయని జనసేన నాయకులపైనా హత్యాయత్నం కేసులు పెట్టారు – చంద్రబాబుపై నంద్యాలలో ఘటన కూడా అలాంటిదే – చంద్రబాబుపై చిత్తూరు, నంద్యాల ఘటనలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వమే వ్యవహరిస్తోంది – వైసీపీ అధికారంలో ఉండటం వల్లే శాంతిభద్రతలకు విఘాతం : జనసేన అధినేత పవన్ కల్యాణ్
స్కిల్ డెవలప్‌మెంట్‌లో రూ. 550 కోట్ల స్కామ్ జరిగింది: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్
స్కిల‌్ డెవల్‌మెంట్ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబు: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్
ప్రభుత్వానికి రూ. 371 కోట్ల నష్టం జరిగింది.: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్
చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసు: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్
నకిలీ ఇన్‌వాయిస్‌లతో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్
మార్కాపురం నియోజకవర్గం తాడివారిపల్లిలో చంద్రబాబుని కాన్వాయ్‌ను అడ్డుపడ్డ గ్రామస్థులు- పోలీసుల లాఠీ ఛార్జ్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తన తండ్రి చంద్రబాబును చూసేందుకు బయల్దేరిన లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తన తండ్రిని చూసేందుకు కూడా వెళ్లనీయ్యకపోవడం ఏంటనీ లోకేష్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా గంటసేపటి నుంచి అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. నోటీసులు అడిగితే డిఎస్పీ వస్తున్నారు అని చెబుతున్నారు పోలీసులు. రోడ్డు మీద నుంచి క్యాంపు సైట్ లోకి రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు. లోకేష్ వద్దకు మీడియా కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. వస్తే అరెస్టు చేయాలని ఆదేశిస్తున్నారు పోలీసులు. నా తండ్రిని చూడడానికి నేను వెళ్ళకూడదా అని పోలీసులను నీలదీసిన లోకేష్. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు పోలీసులు. లా అండ్ ఆర్డర్ ప్రోబ్లమ్ వస్తుందని చెప్పడంపై లోకేష్ మండిపడ్డారు.
శనివారం ఉదయం ఆరు గంటలకు స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు పోలీసులు. సిఆర్పిసి సెక్షన్ 50(1) నోటీస్ సర్వ్ చేశారు. ఇది సిఐడి డిఎస్పీ ధనుంజయుడు పేరు మీద వచ్చింది. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 ఎండ్ 37 ఏపీసీ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.
పోలీసుల వద్ద ఉన్న FIR కాపీ చూసిన న్యాయవాదులు
- కొన్ని గంటల్లో అన్ని పత్రాలు ఇస్తామన్న పోలీసులు
- FIRలో చంద్రబాబు పేరు లేదని ప్రశ్నించిన న్యాయవాదులు
- FIRలో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు?
- అరెస్టుకు ముందు ఆ పత్రాలు ఇవ్వాలన్న చంద్రబాబు
- అరెస్టు చేశాకా తర్వాత తగిన పత్రాలు ఇస్తామంటున్న పోలీసులు
- దేని గురించి అరెస్టు చేస్తారనే అడిగే హక్కు సామాన్యులకు కూడా ఉంది
- అరెస్టు నోటీసులు ఇచ్చామంటున్న పోలీసులు
- డీకే బసు కేసు ప్రకారం వ్యవహరించామంటున్న పోలీసులు
- 24 గంటల్లో అరెస్టుకు కారణాలతో కూడిన పత్రాలు ఇస్తామన్న పోలీసులు
- అవగాహన లేకుండా న్యాయవాదులు వ్యవహరిస్తున్నారన్న పోలీసులు
- పోలీసుల తీరే అవగాహన లేకుండా ఉందన్న చంద్రబాబు
- నేను రోడ్డు మీదే ఉన్నా..
- ఎక్కడికి పారిపోతా అన్న చంద్రబాబు
- అర్ధరాత్రి వచ్చి భయోత్సాతం సృష్టించాల్సిన అవసరమేంటి? : టీడీపీ అధినేత చంద్రబాబు
ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎవరు అని చంద్రబాబు ప్రశ్నించారు. అయితే తాను సూపర్‌వైజర్ ఆఫీసర్‌ను అని డీఐజీ వివరించారు. అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎక్కడని ఆయన కాకుండా మీరు ఎందుకు వచ్చారని నిలదీశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇంత వరకు తన పేరు ఎక్కడ లేదని ఇప్పుడు సడెన్‌గా ఎలా అరెస్టు చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించినప్పుడు అన్నీ సమర్పిస్తామని డీఐజీ రఘురామరెడ్డి వివరించారు.
చంద్రబాబు ఉండే ప్రాంతంలో ఎవర్నీ ఉంచడం లేదు. భూమా అఖిల ప్రియసహా ఇతర నాయకులను బయటకు పంపించేశారు. బలవంతంగా వారిని లాగిపడేస్తున్నారు.
పుంగనూరు, అంగళ్ల కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. నంద్యాలలో ఉన్న ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు రౌండప్ చేశారు.
చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు పోలీసులు చేరుకున్నారు. విదేశాలకు వెళ్లిపోతారనే అనుమానంతో వచ్చామని టీడీపీ నేతలకు తెలిపిన పోలీసులు. ఈకేసులో ఇప్పటికే ఇద్దరు విదేశాలకు వెళ్లిపోయారు.. మీరు ఎక్కడికీ వెళ్లొద్దని విచారణకు సహకరించాలని చెప్పడానికే చంద్రబాబు వద్దకు వచ్చామన్నారు.
తాము చేస్తున్న పనికి అడ్డుపడొద్దని టీడీపీ లీడర్లకు వార్నింగ్ ఇస్తున్న పోలీసులు. అర్థరాత్రి వచ్చి అడ్డుపడొద్దని బెదిరించడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇరు వర్గాల మధ్య డిస్కషన్ నడుస్తోంది.
దాదాపు ఐదు వందల మంది పోలీసులు చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ చుట్టుముట్టారు. డీఐజీ రఘురామరెడ్డి ఆధ్వర్యంలో బలగాలు మోహరించారు. అర్థరాత్రి రావడంపై పోలీసులను టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.
Background
నంద్యాలో అర్థరాత్రి కలకలం రేగింది. చంద్రబాబు బస చేసిన ప్రాంతంలో టీడీపీ నాయకుల హడావుడి మామూలుగా లేదు. నంద్యాలలో ప్రసంగం తర్వాత నేరుగా ఆర్కే ఫంక్షన్ హాల్‌కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన బస చేసిన ప్రాంతానికి దాదాపు కిలోమీటర్ మేర టీడీపీ శ్రేణులు, నాయకులు మోహరించి రక్షణగా నిలుస్తున్నారని ప్రచారం నడుస్తోంది.
ఏ క్షణమైనా టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేస్తారంటూ ప్రచారం నడుస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం తన షెడ్యూల్ ప్రకారమే సభల్లో పాల్గొని ప్రజలతో మాట్లాడి బస చేసే ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే ఆయన అరెస్టు కోసం అనంతపురం, కర్నూలు జిల్లా పోలీసు బెటాలియన్‌లు బయల్దేరారనే వార్త వైరల్‌గా మారింది.
చంద్రబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు బయల్దేరారు అనే ప్రచారంతో టీడీపీ శ్రేణులు అలెర్ట్ అయ్యారు. ఆయనకు రక్షణగా నిలిచేందుకు నంద్యాల జిల్లావ్యాప్తంగా ఉన్న కేడర్ తరలి వస్తున్నారు. ఆయన బస చేసే ప్రాంతానికి సమీపంలో ఉన్న నాయకులంతా తమ వాహనాల్లో అక్కడకు చేరుకున్నారు.
ఒక్కసారిగా టీడీపీ కేడర్ నాయకులు ఇలా చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ చుట్టూ మోహరించడంతో చాలా మందిలో అరెస్టు అనుమానాలు మరింత ఎక్కువ అయ్యాయి. అలాంటిది ఏమీ లేదని పోలీసులు, ఓ వర్గం టీడీపీ లీడర్లు చెబుతున్నప్పటికీ, వేకువ జాములోపు అరెస్టు ఖాయమంటున్నారు నంద్యాల, అనంతపురంలో ఉన్న టీడీపీ లీడర్లు.
శుక్రవారం ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా నంద్యాల రాజ్ థియేటర్ సెంటర్‌లో బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ తరఫున సర్వే నిర్వహించిన తర్వాతే సీట్ల అంశాన్ని తేలుస్తామని ముందే ప్రకటించే ఛాన్స్ మాత్రం లేదన్నారు. అందరితో చర్చించిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. తన స్థానంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సీట్లకు ఇది వర్తిస్తుందని వివరించారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీలకు జగన్ పేరు పెట్టుకుంటున్నారని తాము ప్రారంభించిన వాటినే మళ్లీ మళ్లీ ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్ కోతలతో ప్రజలకు అల్లాడిపోతున్నారని.... చార్జీలు పెంచినా విద్యుత్ ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదున్నారు చంద్రబాబు.
బహిరంగ సభకు ముందు చంద్రబాబు.. మహిళా శక్తి హామీలపై మహిళలతో మాట్లాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పురుషులతో సమానంగా ఆస్తిలో వాటా ఇప్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని వివరించారు. తిరుపతిలో మహిళా యూనివర్శిటీకి ఆధ్యుడు కూడా ఆయనేనన్నారు. మహిళలు పురుషులతో పోటీ పడి ఆర్థికంగా ఎదగాలనే డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. తర్వాత దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్‌లు ఇచ్చామని తెలిపారు.
వైఎస్ఆర్‌సీపీలో మాత్రం మహిళలకు వేధింపులు ఎక్కువ అయ్యాయని... లేని దిశా చట్టం చూపించి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు చంద్రాబుబ. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఇప్పుడు ఆ డబ్బులతోనే పథకాలు ఇస్తున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యంతో ఆరోగ్యాలు పాడుచేస్తున్నారని ధ్వజమెత్తారు. గంజాయి వ్యాపారంతో సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -