Kurnool Crime News: కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన చిన్నారులు విగతజీవిలపై తిరిగివచ్చారు. ఆస్పరి మండలం చిగిలిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుంటలో ఈతకు వెళ్లి మృతి చెందిన చిన్నారుల పేర్లు శశి కుమార్, సాయి, కిరణ్, భీమ, వీరేద్ర, మహబూబ్. స్థానికుల ఆ ప్రాంతంలో గాలించి చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. ఆ మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వారిని ఓదార్చడం అక్కడి వారి వల్ల కాలేదు.
చిన్నారుల మృత్యువాత గురించి తెలుసుకున్నా స్థానిక ఎమ్మెల్యే విరూపాక్షి ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు.