chengalpattu express Robbery Case Updates | అనంతపురం: గత కొంతకాలం నుంచి రైళ్లలో దోపిడీలు జరుగుతున్నాయి. తాజాగా చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు విభసం సృష్టించారు. ఎస్-1, ఎస్-2 కోచ్‌లలో దొంగలు దోపిడీ చేసి ప్రయాణికుల వద్ద డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్లో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
ప్లాన్ ప్రకారం దోపిడీ చేసిన నిందితులు
ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలు కోమలి రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే సిగ్నల్ కేబుల్ కత్తిరించిన దుండగులు రైలు నిలిచిపోయేలా చేశారు. ఆ తర్వాత ఎక్స్ప్రెస్ లోకి ఎక్కి s1, s2 కోచ్ లలో ప్రయాణికులను బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. బంగారు గొలుసు లాక్కెళ్లారని కడప రైల్వే పోలీసులకు ఒక ప్రయాణికురాలు ఫిర్యాదు చేసింది. కొందరు ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.