Sri Mallikarjuna Swamy Temple, Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సంబరాలు అంబరాన్నిఅంటాయి. నాలుగోవరోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి నంది వాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో ఆదివారం ఉదయం నుండి అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో నందివాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు కన్నులపండువగా గ్రామోత్సవంలో విహరించారు.
బ్రహ్మోత్సవ కల్యాణానికి చెంచు గిరిజనులు వస్త్రాలు సమర్పణ
మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ( Srisailam Temple Pongal 2023 Celebrations ) భాగంగా పార్వతి మల్లికార్జునస్వామి దేవస్థానం తరుపున బ్రహ్మోత్సవ లీలాకళ్యాణం ఘనంగా నిర్వహించింది. ఈ కల్యాణానికి చెంచు గిరిజనులను ప్రత్యేకంగా ఆహ్వానించిన దేవస్థానం ఈవో లవన్న స్వామి అమ్మవారి కల్యాణానికి వస్త్రాలు సమర్పించిన చెంచు గిరిజనులు ఐటీడీఏ పిఓ.రవీంద్రారెడ్డి వెదురు బియ్యం, ఆకులతో అల్లిన బాసికలు, యజ్ఞోపవితం స్వామి అమ్మవారి బ్రహ్మోత్సవ కళ్యాణానికి గిరిజనులు సమర్పించారు. చెంచు గిరిజనులు పార్వతిదేవిని తమ ఆడపడుచుగా భావించి ఆనవాయితీగా గత సంవత్సరం నుండి బ్రహ్మోత్సవ కల్యాణానికి చెంచు గిరిజనులు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఈ కల్యాణానికి విచ్చేసిన చెంచు గిరిజనులకు దేవస్థానం తరుపున వస్త్రాలు అందజేయగా ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పి.ఓ రవీంద్రారెడ్డి,ఆలయ ఈవో లవన్న,అధికారులు,సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
టీటీడీపై దుష్ప్రచారం చేయొద్దు, అద్దె గదుల ధరల పెంపుపై ఈవో ధర్మారెడ్డి క్లారిటీ
టీటీడీపై విమర్శలు, గదుల ధరల పెంపు ఆరోపణలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల అద్దె గదుల ధరలు పెంచారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, పూర్తి సమాచారం తెలుసుకోకుండా మాట్లాడం చాలా బాధాకరం అన్నారు.
తిరుమలలో 7500 గదులు ఉన్నాయని, వీటితో పాటు యాత్రికులు ఉచిత సముదాయాలు నాలుగు ఉన్నాయని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సామాన్య భక్తులకు సంబంధించిన ఉచితంగా ఉండటానికి లాకర్లు, బోజనం, స్నానపు గదులు ఉన్నాయి. రూ.50, రూ.100 అద్దె గదులు 5 వేల వరకు ఉన్నాయని చెప్పారు. గత 40 సంవత్సరాలుగా అదే అద్దె ఉందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక రూ. 116 కోట్లు తో ఆధునికీకరణ చేశాం. 50 రూపాయలు గది ప్రైవేట్ హోటల్ ధర 2వేలకు కేటాయిస్తారు. గిజర్ , రూమ్ క్లినింగ్, కరెంట్ బిల్లు అన్ని కలిపి ఖర్చు రూ. 250 అవుతుందన్నారు.
వీటి అద్దె పెరిగింది..
సామాన్య భక్తులకు కేటాయించే గదలు ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. 1230 గదులకు 1000 రూపాయల ఉంది. ఇవన్నీ నాన్ ఏసి గదులు, ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులకు ఈ గదులను ఆన్ లైన్ కేటాయిస్తాం. పద్మావతి, ఎంఎబిసీ ప్రాంతంలో సౌకర్యాలు ఎక్కువగా ఉన్న గదుల అద్దె ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో వీఐపీలు అధికంగా వస్తారు. 1344 గదులలో నారాయణ గిరి, ఎస్వీ గెస్ట్ హౌస్ అద్దె పెంచామని క్లారిటీ ఇచ్చారు.