Payyavula Keshav: ఈ ఎన్నికల్లో  గెలుపు ..తెలుగుదేశానికి(Telugu Desam), చంద్రబాబు(Chandra Babu)కే కాదు ఆ పార్టీలోని చాలామంది సీనియర్ నేతలకు అవసరం. కొంతమంది రాజకీయ జీవితానికి చిట్టచివరి ఎన్నికల్లో విజయం సాధించగా....మరికొందరిపై దశాబ్దాలుగా ఉన్న అపవాదులను తొలగించింది.

 

పయ్యావుల శాపం తొలగింది

పయ్యావుల కేశవ్‌(Payyavula Keshav)....తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. తెలుగుదేశం(Telugudesam0 పార్టీకి అత్యంత విశ్వసనీయమైన నేత. పార్టీ కోసం నిస్వార్థంగా ఎంతవరకైనా పోరడగల ధీశాలి. తన వాక్చాతుర్యంతో  ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొగల సత్తా ఆయన సొంతం.అయినప్పటికీ ఎన్నో ఏళ్లుగా ఆయనపై ఓ అపవాదు ఉంది. పయ్యావులు కేశవ్‌ గెలిస్తే తెలుగుదేశం గెలవదని.... తెలుగుదేశం గెలిస్తే పయ్యావుల కేశవ్గె లవడని.1994లో కేశవ్‌ తొలిసారి గెలిచినప్పుడు మినహా మిగిలిన అన్నిసార్లు ఇది అక్షరసత్యమైంది. 1999లో తెలుగుదేశం అధికారంలోకి రాగా...ఉరవకొండ నుంచి కేశవ్ ఓడిపోయాడు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో  వరుసగా రెండుసార్లు కేశవ్ విజయం సాధించినా...తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారం చేపడితే...ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రం ఓడిపోయారు.

 

ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నా...కేవశ్‌ గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదన్న నానుడి పడిపోయింది. చాలామంది తెలుగుదేశం కార్యకర్తల్లో పయ్యావుల ఓడిపోవాలని కోరుకునే వారూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.మరోసారి అది నిజం చేస్తూ గత ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ విజయం సాధించగా...తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారం కోల్పోయింది. దీంతో ఈ ప్రచారన్ని ప్రజలు బలంగా నమ్మారు. దశాబ్దాల తరబడి పార్టీనే నమ్ముకుని ఉంటూ...పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నా ఇప్పటికీ ఆయన మంత్రి కాలేకపోవడానికి కారణం...కేశవ్‌ ఎప్పుడు గెలిచినా పార్టీ అధికారంలో ఉండకపోవడమే. అన్నిసార్లు ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే పోరాటం చేశారు.

 

కానీ ఈసారి తెలుగుదేశం సృష్టించిన ఓట్ల తుపాన్‌లో పాత ప్రచారాలన్నీ కొట్టుకుపోయాయి. అదృష్టాలు, నమ్మకాలన్నింటినీ పాతాళంలోకి తొక్కిపడేస్తూ తెలుగుదేశం అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఈసారి ఎన్నికలు 1994 ఫలితాలను పునరావృతం చేస్తాయని పయ్యావుల కేశవ్‌ పదేపదే చెప్పినట్లుగానే....ఈ ఎన్నికల్లో ఆయన గెలిచాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఇన్నాళ్లు ఆయనపై ఉన్న అపవాదు తొలిగిపోయింది. ఎట్టకేలకు అధికారపార్టీలో ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో ఈసారి  మంత్రిపదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది.