Nara Lokesh praise Prime Minister Modi: దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చింది మోదీనే..నమో అంటేనే విక్టరీ అని మంత్రి లోకేష్ అన్నారు. శ్రీశైలంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభలో మాట్లాడారు. మోదీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందనన్నారు. నమో అంటేనే విక్టరీ అని.. దేశాన్ని సూపర్ పవర్ గా మార్చారని పేర్కొన్నారు. మోదీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు బుద్ది చెప్పారని పేర్కొన్నారు.భారత్‌ను తిరుగులేని శక్తిగా ప్రధాని మోదీ మారుస్తున్నారని పొగడ్తల వర్షం కురిపించారు
బ్రిటీష్ వారిని గడగడలాడించిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పుట్టిన నేల..కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బురుజు మన నమో అంటే విక్టరీ, ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే.. గుజరాత్ సీఎంగా దేశ ప్రధానిగా 25 ఏళ్లు పూర్తిచేసుకున్నారని గుర్తుచేశారు. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్నా తొలి ఏడాది ఎలా కష్టపడ్డారో ఇప్పుడూ అలాగే కష్టపడుతున్నారని.. గుజరాత్‌ను శక్తిమంతమైన రాష్ట్రంగా మార్చారన్నారు. దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చారు మన నమో ..గతంలో ఉగ్రదాడులు జరిగితే ఐరాస లేదా ఇతర దేశాల సాయం కోరేవారని గుర్తు చేశారు. మన నమో రూటే వేరు, ఆయన కొట్టిన దెబ్బకు పాక్ దిమ్మ తిరిగింది..అమెరికా పన్నులు పెంచితే పెద్ద దేశాలే వణికిపోయాయన్నారు. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు అనేది నమో స్టైల్ అన్నారు. ప్రధాని గుండె ధైర్యం ఆత్మనిర్భర్ భారత్ అని.. నమోకు దేశ ప్రజలంటే నమ్మకం, మనకు నమో అంటే నమ్మకం అన్నారు. దసరా, దీపావళి కలిసి వచ్చినట్లుగా సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ అన్నారు.