Nara Lokesh Kadapa Visit: రేపు కడపలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి లేనందున పర్యటనలో టీడీపీ నాయకులు ఎవరూ పాల్గొనవద్దంటూ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల క్రితం అరెస్ట్ అయిన ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు లోకేష్ కడపకు రానున్నారు. అయితే కడప కేంద్ర కారాగారంలో ఉన్న  ప్రవీణ్ ను పరామర్శించిన తర్వాత, ప్రొద్దుటూరులో ఉన్న ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించాలనుకున్నారు. ఇందుకు సంబంధించి టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే కడప పోలీసులు పర్యటనలో పాల్గొన వద్దంటూ టీడీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేనందున సదరు కార్యక్రమంలో ఎవరూ పాల్గొనద్దని పోలీసులు హెచ్చరించారు. 


అసలు పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో ఏముంది?


18.10.2022వ తేదీన టీడీపీకి చెందిన జనరల్ సెక్రెటరీ అయిన లోకేష్ కడప పర్యటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేనందున టీడీపీ లీడర్లు ఎవరూ ఆ కార్యక్రమంలో పాల్గొనకూడదని... ఎటువంటి సంఘటనలు జరపకూడదని తెలియజేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఆదేశాలను తప్పితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.  






నోటీసులపై స్పందించిన నారా లోకేష్..


పోలీసులు తన పర్యటనను నిరాకరించిన విషయం తెలుసుకున్న నారా లోకేష్ స్పందించారు. ప్యాలెస్ లో ఉన్న పిల్లి భయపడిందంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. 


ప్రవీణ్ అరెస్ట్ పై కూడా నారా లోకేష్ ట్వీట్లు..