AP Assembly Elections: ఉమ్మడి అనంతపురం జిల్లా టిడిపికి కంచుకోటగా ఉండేది. కానీ 2019లో ఘోర ఓటమి.. అయితే 2024 ఎన్నికల్లో మరోసారి టీడీపీ అడ్డాగా మారునుందా... సీఎం జగన్ (AP CM YS Jagan) పైన వ్యతిరేకత సైకిల్ కి పాజిటివ్ వేవ్ తో కార్యకర్తలలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అయితే అనంతపురం (Anantapur) రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు దాదాపు తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మరోవైపు వైసీపీ దూకుడుగా అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తోంది. టీడీపీ,జనసేన మొదట లిస్ట్ ఇంకా రాలేదు. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ టికెట్ ఆమెకే కన్ఫామ్ అయినట్టు సమాచారం. 


రాయలసీమలో అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉన్న జిల్లా చెప్పవచ్చు. గత రికార్డు చూసిన టీడీపీ భారీ విక్టరీలే సాధించింది. 2014లో 12 అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు లో పసుపు జెండా ఎగిరింది 2019 ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్  ప్రజలు మార్పు కోరుకోవడంతో.. వైసీపీ సునామీలో టీడీపీకి రివర్స్ ఫలితాలు వచ్చాయి. దీంతో పార్టీ అంతర్మథనంలో పడిపోయింది. జిల్లా టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ అయ్యాయి. సింగనమల నియోజకవర్గం లోను ఇదే పరిస్థితి. గత కొంతకాలంగా నియోజకవర్గ ఇంచార్జ్ గా శ్రావణి (Bandaru Sravani) కొనసాగారు. నియోజకవర్గంలో అనుకోని పరిణామాలతో టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇంచార్జ్ బాధ్యతల నుంచి బండారు శ్రావణిని తప్పించి అధిష్టానం టూ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేసింది. అప్పట్లో ఈ నిర్ణయంతో అధిష్టానంపై పెద్ద దుమారమే రేగింది.


అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి 2024లో ఎవరు పోటీ చేయబోతున్నారో అనేది అనేక పశ్నార్థకంగా మారడంతో అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే మొదటి నుంచి నియోజకవర్గంలో బలంగా వినిపించిన పేరు బండారు శ్రావణి అని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో మొదటిసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ సునామీలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేతిలో శ్రావణి ఓటమి చెందారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం కూడా నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచారు. ప్రజలతో మమేకం అవుతూ  ప్రజల మధ్య తిరుగుతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. సింగనమల నియోజకవర్గంలో స్థానిక నాయకులు వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. వీటి వల్ల క్రమంగా నియోజకవర్గానికి దూరం అవుతున్నట్లు శ్రావణి పైన నెగటివ్ ప్రచారం జరిగింది. స్థానిక రాజకీయ పరిణామాలు అంచనా వేయకపోవడం క్యాడర్ కి, లీడర్ కి మధ్య దూరం పెరగడంతో బండారు శ్రావణి నియోజకవర్గంలో కొంత కాలం పాటు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
సింగనమల నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నడిపించే నాయకులు అక్కడ లేకపోయినా పార్టీ కార్యకర్తలే నాయకుల్లాగా ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం టు మెన్, త్రీ మెన్ కమిటీలు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ ప్రయోగంతో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలంగా పుంజుకుంది. మరికొన్ని నియోజకవర్గాల్లో  పార్టీ మరింత క్షీణించి గ్రామ స్థాయి నాయకుల మధ్య వర్గ విభేదాలకు దారితీశాయి. సింగనమల నియోజకవర్గంలో ఇది ఎక్కువగా కనిపించింది. ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో సింగనమల నియోజకవర్గంలో బండారు శ్రావణితో పాటు అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు తెరమీదకి వచ్చాయి.. అధిష్టానం  వివిధ రూపాల్లో సర్వేలు మీద సర్వేలు చేయించారు. రాబిన్  శర్మ టీం తోపాటు అన్ని సర్వేలు నియోజకవర్గంలో బండారి శ్రావణి పేరునే సూచించినట్లు సమాచారం. అధిష్టానం కూడా గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అవ్వడంతో  సింగనమల నియోజకవర్గం నుంచి  2024లో బండారి శ్రావణి నే పోటీ చేస్తే మంచిదని ఒక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నుంచి పిలుపు రావడంతో విజయవాడ టీడీపీ కార్యాలయం చేరుకున్న బండారు శ్రావణి.. లోకేష్ తో శ్రావణి మీట్ అవ్వడంతో సింగనమల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా  శ్రావణి కి లైన్ క్లియర్ అయిందంటూ  నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
 సింగనమల నియోజకవర్గం వైసీపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారనేది క్లారిటీ లేదు. నిన్నటి వరకు కూడా టీడీపీ పార్టీలో అదే పరిస్థితి... సర్వేలన్నీ బండారు శ్రావణి వైపు చూపిస్తున్నా... అధిష్టానం మాత్రం ఎటు తేల్చలేదు. అయితే విజయవాడ టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ ను బండారు శ్రావణి కలవడంతో సింగనమల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా దాదాపు శ్రావణి లైవ్ క్లియర్ అయినట్టే అని స్థానికంగా వినిపిస్తోంది.