అనంతపురం: ‘నేను ఎవరి భూములు జోలికి పోవాల్సిన అవసరం లేదు గత 30 సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ఏ మచ్చ లేకుండా ప్రజలకు, కార్యకర్తలకు నాకు తోచిన విధంగా సేవ చేస్తున్నా.. నాపై వస్తున్న ఆరోపణలు ఎవరైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను’ అని ఏపీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు.

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి  మీడియాతో మాట్లాడుత.. గొడ్డుమర్రి ఆదినారాయణ అనే వ్యక్తి అనవసరంగా ఆధారాలు లేకుండా కొంతమంది నాయకులకు వాస్తవాలు చెప్పడం లేదు. నాపై అభాండాలు వేస్తూ నా ప్రతిష్టకు కలిగించేలా చాలాసార్లు ప్రసారమాధ్యమాల ద్వారా పత్రికల ద్వారా అమాయకులను రెచ్చగొడుతున్నారు. కొంత మంది సంఘాల నాయకులకు నిజాలు చెప్పకుండా వారిని ప్రలోభ పెట్టి వాస్తవాలను మరి దాచిపెట్టి, వారితో నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.

మా గ్లోబల్ హార్టికల్చర్ కంపెనీలో ఏడు మంది డైరెక్టర్లలో ఆదినారాయణ ఒకరు. మా కంపెనీలో మిగతా డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఫేక్ రెజులేషన్ చేసి కంపెనీకి సంబంధించిన 100 ఎకరాల పైచిలుకు భూమిని తన భార్య బామ్మర్ది , మామ, అన్న పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మిగిలిన 6 మంది డైరెక్టర్లకు ఈ ఆదినారాయణ యాదవ్ తీవ్రమైన ద్రోహం చేశాడు. కాబట్టి కంపెనీ తరఫున డైరెక్టర్ అందరూ ఎన్ సి ఎల్ టీ కి, న్యాయస్థానానికి వెళ్లి స్టే తీసుకువచ్చాం. తన బంధువులకు 100 ఎకరాల పైచిలుకు భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ కంపెనీ భూమిని ఈ ఆదినారాయణ సుమారు 26 మందికి ఈ చెల్లని భూమిని అమ్మి వారిని కూడా పూర్తిగా మోసం చేశారు. ఈ కంపెనీలో ఒక డైరెక్టర్ మాత్రమే రిజిస్ట్రేషన్ లో సంతకం చేశారు. మిగతా డైరెక్టర్లు  ఎవరు కూడా సంతకాలు చేయలేదు. మిగతా డైరెక్టర్ల సంతకాలు లేకుండా ఆదినారాయణ నుంచి కొన్నవారికి ఈ భూమి ఎలా చెల్లుబాటు అవుతుందని’ పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు.

 న్యాయస్థానమే నిజాలు తేల్చుతుంది 

ఆదినారాయణ నుంచి మేము నష్టపోయిన భూమిని న్యాయస్థానం ద్వారా ఆ సమస్యను  పరిష్కరించుకుంటాం. మాకు రావాలసిన భూమి కంటే అదనంగా ఒక సెంటు కూడా మాకొద్దు. ఈ ఆదినారాయణ నాపై భూ కబ్జాలు అంటూ  అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అందులో ఒక సెంటు భూమి కాజేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. నడిరోడ్డు మీద ప్రజలకు క్షమాపణ చెబుతా. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులు వాస్తవాలు గమనించాలని కోరుతున్నాను.

దొంగే దొంగ అన్నట్లుగా ఆదినారాయణ మా కంపెనీ భూములు అక్రమంగా అన్ లైన్ చేసుకొని  తానేదో సత్యహరిచంద్రుడిలా  అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఆదినారాయణకు  మా నుంచి ఎలాంటి మోసం జరగలేదు. ఆయనే మాకు మోసం చేశాడు తప్ప మేము ఎవరిని మోసం చేయలేదు. ఆదినారాయణ అనే వ్యక్తి మాకు మోసం చేసినా తట్టుకుంటాం. కానీ ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లి కి చెందిన సుమారు 50 మందికి పైగా గిరిజన రైతులకు సంబంధించిన 170 ఎకరాల ను దౌర్జన్యంగా తన పేరున, కుటుంబ సభ్యుల పేరుట బంధువుల పేరిట 1బి అడంగల్ ఆన్ లైన్, పాసు పుస్తకాల్లో భూములు ఎక్కించుకున్నాడు. కోట్లాది రూపాయలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని అత్యంత ఆర్థిక లబ్ధి పొందాడు. ఇంతకంటే  అన్యాయం మరొకటి ఉందా అని ప్రశ్నించారు.  కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆదినారాయణ : 

అనంతపురం మండలంలోని అనంతలక్ష్మి కళాశాల ఎదురుగా సుమారు 50 కోట్లకు పైగా విలువచేసే ప్రభుత్వ భూమిని తన పేరున అక్రమంగా పొందిన మాట వాస్తవం కాదా ఈ విషయంపై అనంతపురం ఆర్డీవో విచారణలో కూడా నిజమని తేలింది నిజం కాదా? అంతేకాకుండా కియా చుట్టూ పక్కల పదుల సంఖ్యలో రైతులను బెదిరించి తన పేరుట వన్ బీ, అడంగల్ లో అన్ లైన్ చేసుకొని ఆ భూమిని అమ్మి లబ్ధి పొందిన మాట వాస్తవమా కాదా? చిలమత్తూరు మండలం సోమగుట్ట ప్రాంతంలో 50 ఎకరాలకు పైచిలుకు ప్రభుత్వ భూమిని అమాయక రైతుల నుంచి దౌర్జన్యంగా ఆక్రమించుకుని ఆ రైతులను మోసగించింది  వాస్తవమా కాదా? 

ఆదినారాయణ చేసిన ఈ భూ అక్రమాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, రెవిన్యూ శాఖ మంత్రికి ఈ విషయంపై  ఫిర్యాదు కూడా చేశారు. అదేవిధంగా అడివి బ్రాహ్మణపల్లికి చెందిన బాధిత గిరిజన రైతులు ఎస్టీ సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఆదినారాయణ భూ అక్రమ లపై ఫిర్యాదు చేశారు. ఈ భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు విచారణ కూడా చేశారు. ఇవి నిజమే అని రెవెన్యూ అధికారులు నివేదికలో అందించిన మాట వాస్తవమా కాదా? బాధిత కుటుంబాలు ఈ విషయాన్ని ముదిగుబ్బలో ఈ ఆదినారాయణ పై ఎస్సీ ,ఎస్టీ కేసు కూడా నమోదయింది. ఇది వాస్తవమా కాదా? ఇన్ని అరాచకాలు భూకబ్జాలు చేసి వందలాది ఎకరాలు అమాయక రైతుల భూములను ఆక్రమించి వారిని  మోసం మోసగించి ద్రోహం చేశాడు. 

 ప్రభుత్వానికి మాజీ మంత్రి విజ్ఞప్తి..

 భూములు ఆక్రమించినట్లు కొందరు వ్యక్తులు నామీద ఆరోపణలు చేస్తున్నారు.  నేను భూములు ఆక్రమించి ఉంటే ప్రభుత్వం ద్వారా సిట్ ఏర్పాటు చేసి వాటిపై విచారణ చేసి నిజా నిజాలు నిగ్గు తేల్చాలని కోరుతున్నాను. తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి దీనిపై ప్రభుత్వం పూర్తి విచారణ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. సిట్టింగా జడ్జి లేదా సిట్ తో ఏర్పాటుచేసి ఈ ఆదినారాయణ భూ అక్రమాలపైన, నాపై వచ్చిన భూ అక్రమాల ఆరోపణలపైన విచారణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.