Kurnool Bus Fire Accident : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో  అక్టోబర్ 24 ఉదయం హైదరాబాద్-బెంగళూరు హైవేపై ప్రైవేట్ లగ్జరీ వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  20 మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. . బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న చాలా మంది ప్రయాణికులు నిద్రపోతున్నారు. దీని కారణంగా ప్రమాదం జరుగుతున్న టైంలో చాలా మందికి బయటకు రాలేకపోయారు. ఈ కారణంతోనే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. మొన్న ఈ మధ్య రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. ఇవాళ కర్నూలు దుర్ఘటన భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇలా తరచుగా ఎందుకు మంటలు చెలరేగుతున్నాయి. బస్సులో ప్రమాదాన్ని గుర్తించే సరైన మార్గం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

Continues below advertisement

కర్నూలు మాదిరిగానే రాజస్థాన్‌లో కూడా ఘటన జరిగింది

హైదరాబాద్-బెంగళూరు హైవేపై బస్సులో మంటలు చెలరేగిన వెంటనే, 20 మంది ప్రయాణికులు కిటికీలు పగలగొట్టి బయటకు రావడానికి ప్రయత్నించారు. మిగిలిన ప్రయాణికులు లోపలే చిక్కుకుపోయారు. మంటల్లో సజీవంగా దహనం అయ్యారు. దీని తరువాత, పోలీసు రెస్క్యూ బృందం బాధితులను గుర్తించడం, గల్లంతైన వారి కోసం వెతకడం ప్రారంభించింది. ఈ ప్రమాదానికి ముందు, అక్టోబర్ 14 న, జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళుతున్న బస్సులో మంటలు చెలరేగడంతో 22 మంది మరణించారు. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళుతున్న బస్సులో ప్రయాణిస్తున్న వారిలో చాలా మంది బస్సులోనే మరణించారు. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా బస్సు ప్రయాణ భద్రతపై ఆందోళనను పెంచాయి.

ఈ పని కచ్చితంగా చేయండి!

అన్నింటి కంటే ముఖ్యమైంది. బస్‌కు రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి. చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. బస్ బాగాలేకపోయినా, సర్వీసింగ్ సరిగా లేకున్నా, ఏ ఇతర సమస్య ఉన్నా సరే ఇకపై ఈ బస్‌లో రాకూడదని అనుకుంటారే తప్ప రేటింగ్‌ సమయంలో వీటిని ప్రస్తావించరు. మీరు ఆ బస్‌లో ట్రావెల్ చేయకపోయినా వేరే వాళ్లు చేస్తారు. వాళ్లు ప్రమాదానికి కారణం అవుతారు. అందుకే బస్‌లలో ప్రయాణించే వాళ్లు కచ్చితంగా రేటింగ్ ఇవ్వాలి. అప్పుడే ఆ బస్‌లో ఉన్న లోపాలను, సమస్యలను కచ్చితంగా చెప్పాలి. దీని ఆధారంగా యాజమాన్యం వాటిని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. మీరు బస్‌లో ప్రయాణం చేసేటప్పుడు మితిమీరిన వేగంతో వెళ్లినా సరే ఆ విషయాన్ని కూడా రేటింగ్స్‌లో ప్రస్తావించండి. 

Continues below advertisement

బస్సులో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణాలు ఏమిటి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, బస్సుల్లో మంటలు చెలరేగడానికి అనేక సాంకేతిక, బాహ్య కారణాలు ఉన్నాయి. చాలాసార్లు, ఎయిర్ కండిషన్డ్ బస్సుల్లో షార్ట్ సర్క్యూట్ లేదా సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ లోపం కారణంగా మంటలు చెలరేగుతాయి. హైదరాబాద్-బెంగళూరు ప్రమాదంలో, బైక్ ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. దీనితో పాటు, ఎక్కువ మంది ప్రయాణికుల రద్దీ కారణంగా బస్సు ఉష్ణోగ్రత పెరగడం వల్ల కూడా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. చాలాసార్లు, బస్సుల్లో మంటలు చెలరేగినప్పుడు ఫైర్ ఎగ్జిట్ లేదా తగినంత రక్షణ లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రమాదాన్ని ఎలా గుర్తించాలి?

మీరు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, బస్సులోపల పొగ లేదా మంట వాసన వస్తే, వెంటనే వాహనాన్ని ఆపండి లేదా ఆపించండి. ప్రయాణికులందరినీ బయటకు పంపించేయండి. దీనితో పాటు, బస్సు యజమానులు క్రమం తప్పకుండా బస్సును తనిఖీ చేయాలి, ఇది షార్ట్ సర్క్యూట్ లేదా ఆయిల్, గ్యాస్ లీకేజీ వంటి వాటిని గుర్తించడంలో సహాయపడుతుంది. ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావిస్తే, డ్రైవర్ వెంటనే ప్రయాణికులను బస్సు నుంచి దించేయాలి.