లాభాల్లేవన్న కారణంతో చాలా ప్రాంతాల్లో థియేటర్లు మూత పడుతుతన్నాయి. కానీ అనంతపురంలో కాస్త ట్రెండీగా ఆలోచించి మరిన్ని థియేటర్లు ప్రారంభిస్తున్నారు. 


ఎప్పటికప్పుడు నూతన పోకడలతో అనంతపురం వాసులు చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయి. ఇప్పటి వరకు సినిమాలు చూడాలంటే ఏ మాల్ కో లేదా ఏ సినీ కాంప్లెక్స్‌కో వెళ్లి భారీ జనసందోహం మధ్య సినిమా చూస్తున్న రోజులివి. కానీ వాటికి భిన్నంగా, ప్రస్తుత ట్రెండ్ పాలో అవుతూ అనంతపురంతోపాటు, తాడిపత్రి మరికొన్ని ప్రాంతాల్లో ఇగ్లూ టైప్ సినిమా థియేటర్ల నిర్మాణం జోరందుకొంది.


తాడిపత్రిలో ఇగ్లూ మినీ థియేటర్


అనంతపురంలో ఛోటా మహరాజ్ సినిమా పేరుతో ఒక ఇగ్లూ టైప్ మిని థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. తాడిపత్రిలో కూడా అతి త్వరలో ప్రారంభానికి సిద్దం అవుతోంది. బత్తలపల్లి, దర్మవరం, పుట్టపర్తిలో కూడా ఇలాంటి థియేటర్ల నిర్మాణానికి కొంతమంది సిద్దం అవుతున్నారు. వంద మంది సీటింగ్ కెపాసిటీతో ఉండే ఈ థియేటర్లు ఎలాంటి గందరగోళం లేకుండా ...ప్రశాంతంగా సినిమా చూసే వీలుంటుంది.


అనంతలో మినీ థియేటర్‌ విప్లవం


దక్షిణ భారతదేశంలో రెండో థియేటర్ అనంతపురంలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు తెలంగాణలోని కల్లూరులో మొదటిది కాగా, అనంతపురంలో రెండోది ప్రారంభం చేసినట్లు నిర్వాహకుడు నవీన్ తెలిపారు. అనంతపురం తరువాత తాడిపత్రి, హిందూపురంలో మరో వారం, పదిరోజుల్లోపు థియేటర్లు ప్రారంభానికి రెడీగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అక్కడ వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. జిల్లాలో ఇక్కడ చూసిన తరువాత బత్తలపల్లి, ధర్మవరం, పుట్టపర్తిలో కూడా చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారన్నారు నవీన్.


నయా ట్రెండ్‌


సాధారణ థియేటర్లకు ఏవిధంగా అయితే పర్మిషన్లు తీసుకొంటారో ఈ సినిమా థియేటర్‌కు కూడా అలాంటి పర్మిషన్లు తీసుకుంటారు. ఈ మిని థియేటర్ నిర్మాణానికి దాదాపు కోటి రూపాయలకుపైగా ఖర్చు అవుతుంది. ఉత్తర భారతదేశంలో ఈ థియేటర్లు మంచి ట్రెండ్లో ఉన్నాయని, అందుకే తన మిత్రుడు చెప్పడంతో ముంబయి వెళ్లి చూసి వచ్చి ఈ థియేటర్ నిర్మించినట్లు నవీన్‌ తెలిపారు.


పీస్‌ఫుల్‌గా సినిమా


ఛోటా మహారాజ్ కంపెనీకి లీజుకు ఇచ్చామని, సినిమి డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలన్ని కూడా వారే చూసుకొంటారన్నారు నవీన్‌. సౌత్ ఇండియాలో ఇది రెండోది కాగా, తెలంగాణలో ఒకటి స్టార్ట్ చేశారన్నారు. ఇపుడిపుడే ఈ నయా ట్రెండ్ ఇక్కడ కూడా స్టార్ట్ అవుతోందని, వంద మంది సీటింగ్ కెపాసిటి ఉండడం గందరగోళం లేకుండా పీస్ పుల్‌గా సినిమా చూసేందుకు ఈ ఇగ్లూ టైప్ థియేటర్లు సౌకర్యంగా ఉంటాయని తెలిపారు.


సో కొత్త మిని థియేటర్లతో అనంతవాసులు ఎంజాయ్ చేయనున్నారు. ఈ ట్రెండ్ త్వరలోనే చిన్న పట్టణాల్లో కూడా అందుబాటులోకి రానుంది. మరి కొత్త ట్రెండ్ థియేటర్లను ఎంజాయ్ చేస్తున్నామంటున్నారు అనంతపురం వాసులు.