Chandrababu Naidu showered praises on Prime Minister Modi : కర్నూలులో సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ బచత్ ఉత్సవ్ బహిరంగ సభకు ప్రధాని మోదీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట కొలువై ఉన్న దివ్యక్షేత్రం శ్రీశైలం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుషాల గడ్డ లో జీఎస్టీ బచత్ ఉత్సవ్ సభకు ప్రధాని హాజరు కావటం సంతోషంగా ఉందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీకి ఏపీ ప్రజల తరపున అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రిగా... ప్రధానిగా 25 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న ప్రధానికి ప్రత్యేక అభినందనలని.. సరైన సమయంలో సరైన చోట సరైన వ్యక్తిగా ప్రధాని మోదీ ఓ విశిష్టమైన వ్యక్తి.. 21వ శతాబ్దపు నేతగా ప్రశంసించారు. ఎందరో ప్రధానమంత్రులతో కలిసి పని చేసినా మోదీ లాంటి వ్యక్తిని చూడలేదు. విరామం, విశ్రాంతి లేకుండా నిర్విరామంగా ప్రజాసేవలోనే ఉంటున్న అరుదైన వ్యక్తి మోద అన్నారు. ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్లుగా మారాయి. ప్రగతిశీల దేశంగా 2047 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచి సూపర్ పవర్ గా తయారవుతుందన్నారు.
11 ఏళ్లలో 4 కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్లు, 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్, 144 వందే భారత్ రైళ్లు, 55 వేల కి.మీ మేర కొత్త హైవేలు, 86 ఎయిర్ పోర్టులు, 16 ఎయిమ్స్ ఆస్పత్రులు నిర్మించిన ఘనత ప్రధాని మోదీదేనని గుర్తుచేశారు. 7 ఐఐటీలు, 8 ఐఐఎంలను తీసుకువచ్చిన రికార్డు కూడా ప్రధాని మోదీదే ఇది ఆల్ టైం రికార్డు అన్నారు. ప్రధాని సంకల్పంతోనే 11 ఏళ్ల క్రితం 11వ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్ 4వ స్థానానికి వచ్చిందిని.. 2028 నాటికి 3వ, 2038కి 2వ ఆర్ధిక శక్తిగా భారత్ ఎదుగుతుందని జోస్యం చెప్పారు. ఆర్థికంగా మనం బలం ఏంటో ఈ విజయాలు చెబితే...సైనికంగా మన బలం ఏంటో ఆపరేషన్ సింధూర్ చాటిందన్నారు.
జీఎస్టీ తగ్గింపుతో 99 శాతం వస్తువులు 5 శాతంలోపు వచ్చాయని.. మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ అని చద్రబాబు స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని.. గుర్తు చేసుకున్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది. మాటలతో కాదు.. చేతలతో చూపించే వ్యక్తి.. ప్రధాని మోదీ అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో 99 శాతం వస్తువులు 5 శాతంలోపు వచ్చాయి. జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవ్.. భరోసా ఉత్సవ్‌గా మారింది. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రానికి డబుల్ బెనిఫిట్ వచ్చింది. సంక్షేమ పథకాలతో సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామన్నారు. స్వదేశీ మంత్రం.. మనకు బ్రహ్మాస్త్రం.. అన్నీ మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం.. గర్వ్‌సే కహో.. ఏ స్వదేశీ హై అన్న మోదీ నినాదాన్ని అందిపుచ్చుకుంటున్నామని ప్రకటించారు.