Chandra Babu Arrest : శనివారం ఉదయం ఆరు గంటలకు స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు పోలీసులు. సిఆర్పిసి సెక్షన్ 50(1) నోటీస్ సర్వ్ చేశారు. ఇది సిఐడి డిఎస్పీ ధనుంజయుడు పేరు మీద వచ్చింది. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 ఎండ్‌ 37 ఏపీసీ సెక్షన్‌ల కింద  కేసులు నమోదు చేశారు.