Chandra Babu Arrest: ప్రజాసమస్యలపై పోరాడుతున్న తనపై కావాలనే తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం అరెస్టు చేస్తోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇలాంటి సందర్భంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసారు. 


ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్యచేశారు మండిపడ్డారు చంద్రబాబు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అడ్డుకుంటున్నారన్నారు. అరెస్టు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేస్తే నిరూపించాలన్నారు. చివరకు ధర్మమే గెలుస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజలు, టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలి విజ్ఞప్తి చశారు. అనంతరం కారు ఎక్కి పోలీసులతో వెళ్లిపోయారు.