వివేక హత్య కేసులో తనపై వస్తున్న ఆరోపణలకు సుదీర్ఘ వివరణ ఇస్తూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. ఓవైపు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయడం... సాయంత్రం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ జరగనున్న వేళ ఈ వీడియో విడుదల సంచలనంగా మారుతోంది.


వివేక హత్య కేసులో తనపై వస్తున్న ఆరోపణలకు సుదీర్ఘ వివరణ ఇస్తూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. ఓవైపు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయడం... సాయంత్రం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ జరగనున్న వేళ ఈ వీడియో విడుదల సంచలనంగా మారుతోంది. 


ఎవర్నో కాపాడేందుకు సీబీఐ విచారణను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు అవినాష్ రెడ్డి. హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రజలందరికీ తెలియాలని సుమారు ఏడు నిమిషాల నిడివితో ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన ఏమన్నారంటే..."నాకు శివప్రకాష్ రెడ్డి ఆరుగంటలకు ఫోన్ చేశారు. అప్పటిగే జమ్మలమడుగు వెళ్తున్నాను. జీకే కొండారెడ్డి అనే లీడర్ పార్టీలో జాయన్ అవుతున్నారు. అక్కడే బ్రేక్ ఫాస్ట్ చేయాలని కూడా అనుకున్నాను. పులివెందుల రింగ్ రోడ్‌ వద్ద ఉన్నాను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేశారు. అర్జెంట్‌గా వివేకం బావ ఇంటికి వెళ్లూ అన్నారు. ఎందుకు అంకుల్ అని అడిగితే.. బావ చనిపోయారు అని చెప్పారు. వెంటనే నేను వివేక ఇంటికి వెళ్లాను. సార్ వివేక చనిపోయారు బాత్‌రూమ్‌లో డెడ్‌బాడీ ఉందీ అని అక్కడే ఉన్న కృష్ణారెడ్డి నాకు చూపించారు. బెడ్‌రూం నుంచి బయటకు వచ్చే ముందు మరోసారి అడిగాం. ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయా అంటే ఏం లేవు అని అడిగారు. అప్పటికే మేం వెళ్లకు ముందు ఏం జరిగిందో ప్రజల ముందు పెడుతున్నాను. మేం వెళ్లక ముందే అక్కడ వివేక రాసిన లెటర్ ఉంది. ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఆ రెండు ఉన్న విషయాన్ని అల్లుడు రాజశేఖర్‌ రెడ్డికి పీఏ కృష్ణారెడ్డ చెప్పారు. రెండో ఆలోచన చేయకుండా ఆ లెటర్ దాచిపెట్టమని చెప్పారు. మొబైల్‌ ఫోన్ కూడా దాచి పెట్టూ అని చెప్పారు.


ఆ లెటర్‌లో వివేక ఏం రాశారంటే... నేను డ్యూటీకి త్వరగా రమ్మని చెప్పానని డ్రైవర్‌ చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేందుకు నేను చాలా కష్టపడ్డాను డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టవద్దు. డ్రైవర్‌ను వదిలి పెట్టవద్దు అని రాశారు. దీన్ని దాచి పెట్టమని కృష్ణారెడ్డికి రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. ఈ లెటర్ ఈ కేసులో కీ ఎవిడెన్స్. ఈ లెటర్ ఎందుకు దాచి పెట్టారని అడిగితే... ప్రసాద్ చాలా మంచోడు అని సునీత, రాజశేఖర్ రెడ్డి చెప్తున్నారు. ప్రసాద్‌ను ఎవరైనా ఏమైనా అంటారేమో అని దాచి పెట్టామని అంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా లేదా... మీ నాన్ని చివరి సారిగా రాసిన లేఖ, చెప్పిన మాటలను నమ్మరా? ప్రసాద్‌నే ఎక్కువగా నమ్ముతారా? సీబీఐ స్టేట్‌మెంట్స్‌లో కూడా ఓ సారి ఒకలా మరోసార మరోలా చెప్పారు. మిస్టేక్స్‌ను కవర్ చేస్తూ మరో స్టేట్మెంట్ ఇచ్చారు. అలా స్టేట్మెంట్‌ స్టేట్‌మెంట్‌కు మిస్టేక్స్ కవర్ చేసుకోవడానికి కూడా సీబీఐ వాళ్లకు స్వేచ్ఛ ఇచ్చింది. 



ఈ లెటర్ దాచి పెట్టడం అనేది పోలీసులకు ఇన్‌టైంలో చెప్పకపోవడం ఈ కేసులో బిగ్గెస్ట్ బ్లండర్. అలాంటి విషయాన్ని సీబీఐ ఐవో రాంసింగ్ తగ్గించి వేరేలా కేసును విచారిస్తున్నారు. సీబీఐ మొత్తాన్ని తప్పుపట్టే పెద్దవాడిని కాదు కానీ... ఈ ఐవో రాంసింగ్‌ వైఖరి మాత్రం తేడాగా ఉంది. ఎవర్ని కాపాడటానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. సునీతను, రాజశేఖర్‌రెడ్డిని, శివప్రకాష్ రెడ్డిన కాపాడటానికే ఇలా చేస్తున్నారా? తప్పుగా మీరు చేసేది. మర్డర్ అని చెప్పడానికి ఈ లెటర్ కీలక ఆధారం. అలాంటి లెటర్‌ను దాచి పెట్టడం ఇంకా పెద్ద నేరం. పోనీ దాచిపెట్టారు. తర్వాతైనా పోలీసులకు ఆ లెటర్ సంగతి చెప్పి ఇవ్వొచ్చు కదా. మీరు ఎందుకు పోలీసులకు చెప్పలేదు. ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదు. ఆరున్నరకు శివప్రకాష్ నాకు ఫోన్ చేసిన తర్వాత వెళ్లి అరౌండ్‌ 6.45కి నేను పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను. మీకు 6.10కే డెత్‌ న్యూస్ తెలుసు. వివేకా చనిపోయినట్టు 6.10కి తెలిసిన తర్వాత లెటర్‌ తెలిసిన తర్వాత అందులో కంటెంట్‌ కృష్ణారెడ్డి మీకు చదివి వినిపించిన తర్వాత అది మర్డర్ అని తెలిసిన తర్వాత ఎందుకు పోలీసులకు చెప్పలేదు. నన్ను వెళ్లమన్నప్పుడైనా చెప్పాలి కదా. నాపై నమ్మకం లేకపోతే నన్ను ఎందుకు వెళ్లమని చెప్పారు. అంటే మీ ఉద్దేశాలు తప్పు. మీ సైడ్ తప్పు ఉంది. కాబట్టే కావాల్సి లెటర్ విషయాన్ని, మర్డర్ విషయాన్ని దాచి పెట్టారు. ఊరికే నన్ను వెళ్లమని చెప్పారు. నేను సీఐకి ఫోన్ చేసి వివేకానందరెడ్డి చనిపోయారు. చాలా బ్లడ్ ఉంది. నేను సీఐకి చెప్పింది ఇదే. అని వీడియోను ముగించారు. ఈ వీడియో ముగింపు చూస్తుంటే మరికొన్ని వీడియోలు బయటకు వచ్చేలా ఉన్నాయి.