Post Poll Violence In Andhra Pradesh: అనంతపురం: అనంతపురం ఏఆర్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు పడింది. పోలింగ్ అనంతరం తాడిపత్రిలో హింస చెలరేగిన ఘటనలో ఆయనపై చర్యలు చేపట్టారు. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిని డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేశారు డీఐజీ.  బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలున్నాయి.


తాడిపత్రి అల్లర్ల ఘటనలో చర్యలు
ఏపీలో పోలింగ్ సమయంలో, అనంతరం అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో అనంతపురం జిల్లా ఆర్మడ్ రిజర్వ్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు పడింది. తాడిపత్రిలో అల్లర్లు జరిగిన సమయంలో అదనపు బలగాలు కావాలని గత ఎస్పీ అమిత్ బర్దర్ కోరితే, తగినన్ని బలగాలు లేవంటూ బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. సకాలంలో స్పందించి అదనపు బలగాలు పంపకపోవడంతో, అల్లర్లు అధికమైనట్లు అమిత్ బర్దర్ తన నివేదికలో తెలిపారు. అల్లర్ల కారణంగా అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్న అమిత్ బర్దర్ పై ఈసీ చర్యలు తీసుకుని, వేటు వేసింది. 


ఇటీవల గౌతమి శాలికి అనంతపురం జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించింది ఈసీ. ముఖ్యంగా తాడిపత్రి అల్లర్లపై లోతుగా దృష్టి సారించిన ఎస్పీ గౌతమి శాలి... ఏఆర్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డిని పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. కానీ ఆయన సరైన సమా